Students Test Covid19 Positive : ఒకే స్కూల్‌లో 85మంది విద్యార్థులకు కరోనా

విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒకే స్కూల్లో 85మంది విద్యార్థులు కరోనా బారిన పడటం సంచలనం రేపింది.

Students Test Covid19 Positive : ఒకే స్కూల్‌లో 85మంది విద్యార్థులకు కరోనా

Students Test Covid19 Positive

Students Test Covid19 Positive : కరోనావైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒకే స్కూల్లో 85మంది విద్యార్థులు కరోనా బారిన పడటం సంచలనం రేపింది.

ఉత్తరాఖండ్-నైనిటాల్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 85మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. తొలుత 11మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు స్కూల్ లోని మొత్తం 496 మంది విద్యార్థులకు టెస్టులు చేశారు. దీంతో 85మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు తేలింది.

Heart Disease : గుండె జబ్బులు రాకుండా నివారించటం ఎలాగంటే

కొవిడ్ సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో స్కూల్ ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 27 వేల 553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే మరో 284 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 9,249 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలో ప్ర‌స్తుతం 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొన్న‌ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431గా ఉండ‌గా, ఇప్పుడు 1,525కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా రోజువారీ కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపించడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. బెంగాల్ లో సోమవారం(జనవరి 3) నుంచి అన్ని విద్యాసంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, స్పాలు మూసివేయాలని ఆదేశించారు.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో నిర్వహించనున్నారు. పరిపాలనా పరమైన భేటీలను వర్చువల్ విధానంలో చేపట్టాలని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ విధించారు. కోల్ కతాలో గత మూడు రోజుల వ్యవధిలో కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. బెంగాల్ లో కరోనా పాజిటివిటీ రేటు సైతం 5.47 శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది.