అబే.. యోగేశ్వర్.. నీ తండ్రి ఎవరో.. నీ తల్లిని అడుగు : అల్కా లంబా ఫైర్ 

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 06:09 AM IST
అబే.. యోగేశ్వర్.. నీ తండ్రి ఎవరో.. నీ తల్లిని అడుగు : అల్కా లంబా ఫైర్ 

‘ఒరేయ్ యేగేశ్వర్ దత్..నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు.. నీ తండ్రితో DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? నీవు ఎవరివైతే దాచేస్తున్నావో, అతని నీ తండ్రి అని నీ తల్లి చెప్పినప్పుడు అంగీకరించాలి..ఎందుకంటే..తల్లి ఎప్పుడూ అబద్దం చెప్పదు..నువ్వు ఇలాంటి తప్పు చేయడానికి కారణం కనిపించడం లేదు’ అంటూ కాంగ్రెస్ నేత అల్కా లంబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈమే మాజీ ఆప్ ఎమ్మెల్యే. లంబా చేసిన ఓ ట్వీట్ కు యోగేశ్వర్ రెస్పాండ్ కావడం..దీనికి అల్కా లంబా చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యోగేశ్వర్ దత్ ఒలింపిక్ మెడలిస్ట్. (దెబ్బతిన్న దేశాలకు డ్రగ్ సప్లై చేస్తాం: భారత్)

RSSకి రాజకీయాలతో సంబంధం లేదని..బీజేపీ నేతలంతా RSS అక్రమార్కులే అని అల్కా లంబా ట్వీట్ చేశారు. దీనిపై చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో ఒలింపిక్ మెడలిస్టు యోగేశ్వర్ దత్ కూడా ఉన్నారు. ‘అక్రమార్కులెవరో ట్వీట్ ను బట్టి తెలుస్తుంది. నువ్వేంటో నీ మనస్తత్వాన్ని తెలుస్తుంది. ఫొటోగ్రాఫ్ పై ఈ పదాలు రాశారో..ఆయనపై దేశ ప్రజలకు ఎలాంటి ప్రేమ, అభిమానాలున్నాయో తెలుసుకోవాలి..నీలాంటి పిచ్చివాళ్లు తప్ప’ అంటూ ట్వీట్ చేశారు. 

దీనిపై అల్కా లంబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా యోగేశ్వర్ దత్ స్పందించారు. డిగ్నిటీ మెంటేన్ చేయ్యలేని వాళ్ల నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలం అని ట్వీట్ చేశారు. 

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తో చాలసార్లు లంబా విబేధించారు. తర్వాత ఆమె ఆప్ నుంచి వైదొలిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమె చాందనీ చౌక్ నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం లంబా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.