21 ఏళ్ల జైలు జీవితం : నిర్దోషిగా తీర్పు

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 04:36 AM IST
21 ఏళ్ల జైలు జీవితం : నిర్దోషిగా తీర్పు

21 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జిల్లా కోర్టు తప్పిదంతో ఆయన అన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. గంజామ్ జిల్లాలోని కంటపాడ గ్రామంలో ప్రధాన్ నివాసం ఉంటున్నాడు. 1997, నవంబర్‌లో ఓ హత్య కేసులో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.

మహిళను హత్యను చేయడంతో పాటు బంగారు ఆభరణాలను దొంగిలించాడిన జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. 1999, ఆగస్టులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో అతను హైకోర్టు తలుపు తట్టాడు. ఇతన వేసిన పిటిషన్ జులైలో జస్టిస్ ఎస్కే మిశ్రా, ఏకే మిశ్రాల ధర్మాసనం విచారించింది. సాక్ష్యాధారాలను సరైన కోణంలో కింది కోర్టు పరిశీలించలేదని..అతను నిర్దోషి అంటూ తీర్పును వెలువరించింది. హైకోర్టు ఆగస్టు 20వ తేదీ సోమవారం జైలు నుండి రిలీజ్ చేసింది.