Covid treatment with cow urine : గోశాల‌లో కోవిడ్ కేర్ సెంటర్..బాధితులకు గోమూత్రంతో వైద్యం..

ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు గోమూత్రంతో వైద్యం చేస్తున్నారు. గోమూత్రంతో తయారైన ఔషధాలతో వైద్యం చేస్తున్నారు. ‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో త‌యారు చేసిన ఔష‌ధాల‌ను ఇచ్చి చికిత్సనందిస్తున్నారు.

Covid treatment with cow urine : గోశాల‌లో కోవిడ్ కేర్ సెంటర్..బాధితులకు గోమూత్రంతో వైద్యం..

Covid Care Center Inside Gaushala

Covid care center inside gaushala : కరోనా సోకితే హాస్పిటల్ కు వెళ్లనవసరం లేదు..గోమూత్రం తాగండీ..అప్పడాలు తినండీ..అది తినండీ ఇది తినండీ అని సలహాలు వింటూనే ఉన్నాం. అలా సలహా ఇచ్చినవాళ్లు మాత్రం వారికి గానీ వారి కుటుంబ సభ్యులకు గానీ కరోనా సోకితే గబగబా హాస్పిటల్ కు పరిగెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు కొంతమంది. ఇంత వరకూ బాగానే ఉంది. హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లతో బెడ్స్ అన్నీ నిండిపోవటంతో ఇటువంటి సహాయక చర్యలు చాలా మంచిదే. కానీ ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు మెడిసిన్ గా ఏమిస్తున్నారో తెలుసా..‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో త‌యారు చేసిన ఔష‌ధాల‌ను ఇచ్చి చికిత్సనందిస్తున్నారు.

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని ఓ గోశాలలో ఆ శాల ట్రస్టీ నిర్వాహకులు శాలలోనే ఓ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో ఉంటున్న క‌రోనా బాధితుల‌కు ఆవు పాలు, ఆవు మూత్రంతో త‌యారు చేసిన ఔష‌ధాల‌ను ఇచ్చి.. చికిత్స చేస్తున్నారు. తేలికపాటి లక్ష‌ణాలు క‌లిగిన క‌రోనా బాధితుల‌కు ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. ఈ సెంటర్ ను ‘‘వేదలక్షణ పంచగవ్య‌ ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్’’ అని పేరు పెట్టారు. ఈ సెంటర్ కు కొంతమంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఈ సంద‌ర్భంగా గోశాల ట్ర‌స్టీ మోహన్ జాదవ్ మాట్లాడుతూ.. ఈ కరోనా కేర్ సెంటర్ ను మే 5న ప్రారంభించామని..క‌రోనా పాజిటివ్ బాధితుల‌ను ఈ సెంట‌ర్‌లో చేర్చుకుంటుకుని వారికి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఏడుగురు బాధితులు ఇక్క‌డ చికిత్స పొందుతున్నార‌ని, ఎనిమిది ర‌కాల ఆయుర్వేద మందులతో వారికి చికిత్స చేస్తున్నామని తెలిపారు. ఈ ఔష‌ధాల‌ను ఆవు పాలు, నెయ్యి, ఆవు మూత్రాల‌ను వినియోగించి త‌యారు చేస్తున్నామ‌ని తెలిపారు.