Tipu Jayanti: ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల కోసం అనుమతి కోరిన ఎంఐఎం

గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు జరిగిన కర్ణాటక, హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఎంఐఎం పార్టీ.. అధికారులకు దరఖాస్తు చేసుకుంది.

Tipu Jayanti: ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల కోసం అనుమతి కోరిన ఎంఐఎం

Tipu Jayanti: కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఏఐఎంఐఎంమ్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఈ నెల 10న కర్ణాటకలోని హుబ్లిలో ఘనంగా వేడుకలు జరపాలని నిర్ణయించింది.

Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు

దీనికోసం స్థానిక ఈద్గా మైదాన్‌లో ఉత్సవాలు నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులను అనుమతి కూడా కోరింది. ఈద్గా మైదానం విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మసీదును ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో గతంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి. ఈ విషయంపై వివాదం మొదలైంది. అయితే, దీనిపై హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కర్ణాటక హైకోర్టు అనుమతితో ఈద్గా మైదానంలో గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. నిజానికి ఇది ప్రభుత్వ స్థలం. పక్కనే మసీదు ఉండటంతో ఇక్కడ వినాయక చవితి వేడుకలు నిర్వహించే విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Nilgai-Tiger: నిల్గాయ్-పులి మధ్య హైడ్ అండ్ సీక్ ఆట.. పులికి నిల్గాయ్ చిక్కిందా.. చివరికి ఏం జరిగిందో చూడండి

దీనిపై విచారణ జరిపిన కోర్టు దీనిపై హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని తెలియజేసింది. దీంతో ఇక్కడ వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు తాజాగా ఇదే స్థలంలో టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించేందుకు ఎంఐఎం పార్టీ దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్.. నిర్వాహకులతో చర్చలు జరిపిన అనంతరం ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.