Nilgai-Tiger: నిల్గాయ్-పులి మధ్య హైడ్ అండ్ సీక్ ఆట.. పులికి నిల్గాయ్ చిక్కిందా.. చివరికి ఏం జరిగిందో చూడండి

మధ్య ప్రదేశ్ అడవిలో పులి-నిల్గాయ్ మధ్య హైడ్ అండ్ సీక్ ఆట సాగింది. నిల్గాయ్‌కు కనిపించకుండా దాక్కుని, పులి దాన్ని వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ తతంగాన్ని ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Nilgai-Tiger: నిల్గాయ్-పులి మధ్య హైడ్ అండ్ సీక్ ఆట.. పులికి నిల్గాయ్ చిక్కిందా.. చివరికి ఏం జరిగిందో చూడండి

Nilgai-Tiger: అడవిలో ఆహారాన్ని వేటాడి తినడం అంటే ఏ జంతువుకైనా పెద్ద సవాలే. సింహం, పులి, చిరుత, తోడేలు వంటివి తమ ఆహారాన్ని వేటాడేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గంటల తరబడి.. ఇంకొన్నిసార్లు రోజుల తరబడి శ్రమిస్తే తప్ప వాటికి ఆహారం చిక్కదు.

Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు

అది కూడా చాలా తెలివితో వ్యవహరించాల్సి ఉంటుంది. వేటాడాలనుకున్న జీవికి కనబడకుండా, శబ్దం రాకుండా, మాటువేసి వేటాడాలి. ఏ మాత్రం అదను దొరికినా అవి తప్పించుకుంటాయి. అలాగని వేటాడే జీవులే జాగ్రత్తగా ఉంటాయనుకుంటే పొరపాటే. వాటికి బలయ్యే జీవులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుక్షణం గమనిస్తూ వేటాడే జీవులకు దొరక్కుండా తప్పించుకోవాలి. వేటాడేవి.. వేటకు బలయ్యేవి ఒకదాన్ని మించి మరొకటి జాగ్రత్తగా ఉంటేనే మనుగడ సాగిస్తాయి. లేదంటే ఆహారం దొరక్కుండా ఒక జీవి.. ఆహారంగా మరో జీవి బలవ్వాల్సిందే. ఈ రెండు జీవులు ఎంత అప్రమత్తంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా నేషనల్ పార్కు పరిధిలో ఒక పెద్ద పులి నడుచుకుంటూ వెళ్తోంది.

Kerala Muslim Women: ఇరాన్ మహిళలకు సంఘీభావం.. హిజాబ్ దహనం చేసిన కేరళ మహిళలు

దానికి ఎదురుగా 80 మీటర్ల దూరంలో నిల్గాయ్.. గడ్డి మేస్తూ ఉంది. దాన్ని చూడగానే పులి వేటాడాలనుకుంది. నెమ్మదిగా నిల్గాయ్ వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో పులి శబ్దం విన్న నిల్గాయ్ తలెత్తి పైకి చూడగా, పులి నేలపై కిందికి వంగి దాక్కునేందుకు ప్రయత్నించింది. ఇలా నిల్గాయ్ దగ్గరకు పులి వెళ్తుండగా, రెండు, మూడుసార్లు జరిగింది. నిల్గాయ్ చుట్టూ గమనించడం.. పులి దాక్కోవడం.. ఇదంతా హైడ్ అండ్ సీక్ గేమ్‌ను తలపించింది. ఈ ఘటనను రాజేస్ సనాప్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.