అజిత్‌కు డిప్యూటీ : సేనకు 16, ఎన్సీపీ 14, కాంగ్రెస్ 13

ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 11:28 AM IST
అజిత్‌కు డిప్యూటీ : సేనకు 16, ఎన్సీపీ 14, కాంగ్రెస్ 13

ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.

ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమైనట్టే. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ పేరును మిత్రపక్షాలైనా శివసేన, కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను నియమిస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. గురువారం (నవంబర్ 27, 2019) శివాజీ పార్కులో సాయంత్రం 6.40 గంటలకు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉద్ధవ్ తోపాటు 15 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. 

మహారాష్ట్రలో మంత్రి పదవుల పంపకాలపై మూడు పార్టీల మధ్య కసరత్తు కొనసాగుతోంది. శివసేనకు 16, ఎన్సీపీకి 14, కాంగ్రెస్ కు 13 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి 9 కేబినెట్ ర్యాంకులు, నాలుగు సహాయ మంత్రి పదవులు వరించనున్నాయి. స్పీకర్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై ఎన్సీపీ, కాంగ్రెస్ లలో సందిగ్థత నెలకొంది.

మంత్రివర్గంలో కీలక శాఖలు ఎవరికి దక్కనున్నాయనేది ఆసక్తిగా మారింది. అయితే అజిత్ పవార్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం మంత్రిపదవుల పంపకాలపై తుది నిర్ణయానికి రానున్నారు. 

మహారాష్ట్రలో మహా వికాస్ అకాడి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిన నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించి పదవుల విషయంలో ఆయా పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. శివసేన నేత బీజేపీ వైపుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చిన అజిత్ పవార్ కీలక పాత్ర పోషిస్తారనే చెప్పడంతో ఎటువంటి బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్సీపీలోకి రావడం జరిగింది. రెండు రోజుల క్రితమే అజిత్ పవార్ ను శాసనసభ పక్ష నేతగా తొలగించారు. ఎన్సీపీలో మళ్లీ శాసనసభాపక్ష హోదాను ఇస్తూ, డిప్యూటీ సీఎం పదవిని కూడా అజిత్ పవార్ కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 43 మందితో కేబినెట్ ఉండబోతుంది. ఇందులో సహాయ మంత్రి పదువులు ముఖ్యంగా మూడు పక్షాలకు ఉన్న బల బలాలను బట్టి మంత్రి పదవులను కేటాయించబోతున్నారు. 

కీలక పోర్టు పోలియోలను ఎన్సీపీ పంచుకోబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్ల పాటు శివసేన నేత ఉద్ధవ్ థాక్రేకు ఇవ్వటం జరిగింది. మంత్రివర్గంలో కీలక పదవులను ఎన్సీపీ, కాంగ్రెస్ పంచుకోబోతున్నాయి. స్పీకర్ పదవితోపాటు పార్లమెంట్ లో రాజ్యసభ స్థానాలను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్సీపీ కూడా కీలక పోర్టు పోలియోలలో తమ పార్టీ సీనియర్ నేతలు ఉంచే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. 

కనీస ఉమ్మడి కార్యక్రమం (CMP)లో భాగంగా ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఏ ఏ అంశాలుగా ఎజెండాగా ఉండాలి. ఏ ఏ అంశాలపై మహా వికాస్ అకాడి అనేది పని చేయాలనేదానికి సంబంధించి కీలక సమావేశం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు మూడు పార్టీల కీలక నేతలు సమావేశమై కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను ప్రకటించబోతున్నారు.

రేపు ప్రభుత్వం ఏర్పాటులో మంత్రులందరూ ప్రమాణస్వీకారం చేయాలా లేదా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారా అనేదిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఐదేళ్లపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని తెలుస్తోంది.