Punjab Politics : బీఎస్పీతో అకాలీదళ్ పొత్తు, చారిత్రాత్మకమైన రోజు – సుఖ్‌‌బీర్ సింగ్‌‌బాదల్

శిరోమణి అకాలీదళ్ - బీఎస్పీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రాత్మకమైన రోజుగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌‌బీర్ సింగ్‌‌బాదల్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకుందని, 1986లో ఎస్ఏడి, బీఎస్పీ కలిసి లోక్ సభ ఎన్నికల్లో ఫైట్ చేశాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Punjab Politics : బీఎస్పీతో అకాలీదళ్ పొత్తు, చారిత్రాత్మకమైన రోజు – సుఖ్‌‌బీర్ సింగ్‌‌బాదల్

Bsp

Shiromani Akali Dal, BSP : పంజాబ్ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పొలిటికల్ పార్టీలు సర్వసన్నద్ధమౌతున్నాయి. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు పొత్తులపై ప్రధానంగా దృష్టి సారించాయి. శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రాత్మకమైన రోజుగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌‌బీర్ సింగ్‌‌బాదల్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకుందని, 1986లో ఎస్ఏడి, బీఎస్పీ కలిసి లోక్ సభ ఎన్నికల్లో ఫైట్ చేశాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 13 లోక్ సభ స్థానాలకు 11 సీట్లలో విజయం సాధించామన్నారు. మొత్తంగా..2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నాయి.

117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది. శిరోమణి అకాలీ దళ్, బీఎస్పీ కలిసి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. 117 స్థానాల్లో 20 సీట్లలో బీఎస్పీ పోటి చేయగా..97 స్థానాల్లో శిరోమణి అకాలీ దళ్ పోటి చేయనుంది.

ప్రస్తుతం పంజాబ్ లో కెప్టెన్ అమరేందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారాన్ని కోల్పోగా.. 77 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తొలిసారి పోటీలోనే ఢిల్లీ అభివృద్ధి పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు సాధించగా.. శిరోమణి అకాలీదళ్ 68 నుంచి 18కి పడిపోయింది. ఎన్డీఏతో తెగతెంపుల నేపథ్యంలో అకాలీ దళ్ ముందుగానే ఎన్నికలపై ఫోకస్ పెట్టగా రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

 

Read More : Chandrababu-Sonusood: అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశా: సోనూసూద్