పరిస్థితి వేరేలా ఉంటుంది : ఎస్పీ-బీఎస్పీ పోటీచేసే స్థానాలివే

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2019 / 12:55 PM IST
పరిస్థితి వేరేలా ఉంటుంది : ఎస్పీ-బీఎస్పీ పోటీచేసే స్థానాలివే

2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి.  మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్పీ,37స్థానాల్లో ఎస్పీ పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ,రాయబరేలీలో మాత్రం అభ్యర్థిని నిలబెట్టకూడదని రెండు పార్టీలు నిర్ణయించాయి. మిగిలిన మూడు స్థానాలను మిగిలిన భాగస్వామ్య పార్టీలకు కేటాయించాలని నిర్ణయించాయి. తాము పోటీ చేయబోయే స్థానాల లిస్ట్ ను రెండు పార్టీలు గురువారం విడుదల చేశాయి. కాన్పూర్, పిలిబిత్,వారణాసి,ఝాన్సీ, ఇటావా, ఘజియాబాద్, సంబల్,అహాబాద్,మీర్జాపూర్, వంటి వివిధ ముఖ్యమైన స్థానాల్లో  ఎస్సీ పోటీకి దిగుతుండగా మీరట్, ఆగ్రా, సంత్ కబీర్ నగర్,అలీఘర్, షహజానాపూర్,ప్రతాప్ ఘర్, ఘజిపూర్,బదోహి,ఘోషి వంటి వివిధ ప్రతిష్మాత్మకమైన నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీకి దిగనుంది.

అంతకుముందు బీఎస్పీ-ఎస్పీ కూటమిపై బీఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీకి సగం సీట్లు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను యూపీలో 42 ఎంపీ స్థానాలను సొంతం చేసుకొని దేశానికి రక్షణమంత్రినయ్యానని, కానీ ఇప్పుడు ఎస్పీ కేవలం 37స్ధానాల్లో పోటీ చేస్తుందని, ఈ కూటమిని తన కుమారుడు అఖిలేష్ ఏర్పాటు చేశాడని, తానైతే పరిస్థితి వేరేలా ఉండేదని ములాయం అన్నారు. లోక్ సభ చివరి ప్రసంగంలో నరేంద్రమోడీ మరోసారి ప్రధాని కావాలి అని ములాసింగ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ​