మహిళ పైలెట్లే సారధులుగా రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ రైలు

  • Published By: chvmurthy ,Published On : March 1, 2020 / 02:15 PM IST
మహిళ పైలెట్లే సారధులుగా రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ రైలు

మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలు అమలు చేస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్చి 8న రాబోయే  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లే రాజ్యారాణి ఎక్స్ ప్రెస్ రైలును మార్చి1న  మొత్తం మహిళా లోకో పైలట్ల తోనే నడిపించారు రైల్వే అధికారులు.

ఈ విషయాన్ని రైల్వేమంత్రి  పీయూష్ గోయల్ తన ట్విట్టర్లో  పోస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన జత చేశారు. 48 సెకండ్ల పాటు ఉన్న ఈ క్లిప్పు లోఎక్స్ ప్రెస్  రైలును నడుపుతున్న మహిళా లోకో పైలెట్లు ఉన్నారు. పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే వేలమంది ఈవీడియోను వీక్షించారు. అంతేకాదు 10,000 మంది లైక్‌లను మరియు 2,000 రీట్వీట్‌లను సంపాదించి సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

 “ఇది నిజంగా అద్భుతమైన చర్య” …”మేము ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నాము” ..”ఇది మహిళలకు గౌరవప్రదమైనది మరియు మనందరికీ స్ఫూర్తినిస్తుంది”  అంటూ నెటిజన్లు తమ తమ కామెంట్లతో మహిళలకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు ఓ లుక్కేయండి ఈ వీడియోను ….