Amazon : అదిరిపోయే ఆఫర్.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు

ఇప్పటికే అమెజాన్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. తాజాగా మొబైల్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట మరో సేల్‌ను

Amazon : అదిరిపోయే ఆఫర్.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు

Amazon

Amazon Mobile Savings Days Sale : ఇప్పటికే అమెజాన్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. తాజాగా మొబైల్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట మరో సేల్‌ను ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు ఈ సేల్ జరుగుతుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు ఇతర మొబైల్‌ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది.

* మొబైల్‌ కొనుగోళ్లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ
* పలు మొబైల్‌ కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డీల్స్‌
* ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొనుగోలుదారులకు 10 శాతం సుమారు రూ. 1250 వరకు తక్షణ తగ్గింపు
* ‘అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ ప్లాన్‌ కింద ప్రైమ్‌ కస్టమర్లకు 6 నెలల ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై మూడు నెలల అదనపు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ వంటి అదనపు ఆఫర్లు

* వన్‌ప్లస్‌, షావోమీ, శాంసంగ్‌, ఐక్యూ, రియల్‌మీ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై సుమారు 10 శాతం తగ్గింపు ధర
* వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 45,999 నుంచి ప్రారంభం
* ఈ మొబైల్‌ కొనుగోలుపై సుమారు రూ.4వేల వరకు డిస్కౌంట్‌
* ఈ డిస్కౌంట్‌ కూపన్‌ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది
* వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 12నెలల నో కాస్ట్‌ ఈఎమ్‌ఐతో పాటు అదనంగా రూ.3వేల డిస్కౌంట్
* ఎమ్‌ఐ 11 ఎక్స్ కొనుగోలు ఎక్సేచేంజీ పై అదనంగా రూ.5వేలు తగ్గింపు
* మొబైల్ యాక్సెసరీస్‌ ప్రారంభ ధర రూ.69 కాగా పవర్ బ్యాంకులు రూ.399 నుంచి ప్రారంభం

* OnePlus, Xiaomi, Samsung, iQoo, Realme ఫోన్లపై 10శాతం తగ్గింపు
* OnePlus 9R, OnePlus Nord 2, OnePlus Nord CE, Redmi Note 10 series, Redmi 9 series, Mi 11X series, Samsung Galaxy M21 2021 Edition, Samsung Galaxy M32 and Samsung Galaxy M31, Realme X7, iQoo 7 series, and iQoo Z3 ఫోన్లపై బ్యాంకు ఆఫర్లు