Amzon లో రూ. 5 కే గోల్డ్..డిజిటల్ ఇన్వెస్ట్ మెంట్

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 09:22 AM IST
Amzon లో రూ. 5 కే గోల్డ్..డిజిటల్ ఇన్వెస్ట్ మెంట్

ఆన్ లైన్ లో ప్రముఖ స్థానం సంపాదించిన Amazon కంపెనీ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి అదిరిపోయే ఫీచర్ ప్రకటించింది. కేవలం రూ. 5కే డిజిటల్ రూపంలో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చని వెల్లడించింది.



ఈ ఆఫర్…పేటీఎం, ఫోన్‌పే, ఇతర ఆన్ లైన్ సంస్థలు అందిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఒక రూపాయికే బంగారాన్ని అందిస్తున్నారు.

99.5 శాతం స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం అని తెలిపింది. ఒకేసారి బంగారం కొనలేని వారు…చిన్ని మొత్తాల్లో డిజిటల్ రూపంలో ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. అంటే మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటా. బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చని అర్థం.



లైవ్ లో బంగారం కొనాలంటే..డబ్బులు అధికంగా కావాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. వర్చువల్ గా గోల్డ్ ను ఎంత ధరకైనా కొనొచ్చే వీలుంది. ఇలా..ఎప్పటికప్పుడు గోల్డ్ ను వర్చువల్ గా కొంటూ…బంగారంలో పెట్టబడులు పెట్టవచ్చన్నమాట.

చిన్న చిన్న మొత్తాల్లో బంగారం కొంటూ పోతుంటే..ఓ రోజుకు పెద్ద మొత్తంలో బంగారం పోగవుతుంది. మీకేదైనా అవసరం వచ్చినప్పుడు ఆ గోల్డ్ ను అమ్మివేయవచ్చు.