Amazon Layoffs: అయ్యో.. మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్‌.. భారీగా తొలగింపు

అమెరికా ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు షాకిచ్చింది. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం 18వేల మంది ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను పూర్తిచేసింది. తాజాగా మరోసారి 9వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ (amazon ceo andy jassy) మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో కంపెనీ విజయానికి ఇది చాలా కీలకనిర్ణయమని తెలిపారు.

Amazon Layoffs: అయ్యో.. మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్‌.. భారీగా తొలగింపు

amazon

Amazon Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత నష్టాలు, రాబోయే కాలంలో ఇబ్బందులను ముందస్తు అంచనావేస్తూ కంపెనీ భవిష్యత్ కోసం అంటూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రస్తుతం, ఎంత పెద్ద కంపెనీ అయినా.. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాప్ట్, మెటా, ట్విటర్, అమెజాన్ వంటి దగ్గజ కంపెనీలు తమ సంస్థల్లో పలు విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా అమెజాన్ (Amazon) మరోసారి తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది.

Amazon And Flipkart: అనుమతి లేకుండా మందుల విక్రయం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం నోటీసులు

అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తొమ్మిది వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. 2022 నవంబర్ నెలలో అమెజాన్ స్టోర్స్‌లో 18వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం విధితమే. ఈసారి అమెజాన్ వెబ్ సిరీసెస్, అడ్వర్టైజింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు ప్రక్రియ చేపట్టారు. అమెజాన్ సంస్థ తాజా నిర్ణయంతో నాలుగు నెలల్లోనే 27వేల మంది ఉద్యోగులను తొలగించినట్లయింది. అమెజాన్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు కలిగి ఉన్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు 24గంటల నోటీసు, వేతనం ఇవ్వబడుతుంది.

Amazon Mega Electronics Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్.. ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ఉద్యోగుల తొలగింపు విషయంపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ఇలాంటి నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. దీర్ఘకాలంలో కంపెనీ విజయానికి ఇది చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు. అమెజాన్ తాజాగా ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో కంపెనీ చరిత్రలో ఐదవ అతిపెద్ద తొలగింపు కానుంది.