TataNeu : 2 బిలియన్ డాలర్లతో టాటా నుంచి సూపర్ యాప్.. ఫస్ట్ లుక్ అదుర్స్

దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటైన టాటా గ్రూప్ నుంచి కొత్త యాప్ రానుంది. సూపర్ యాప్ TataNeu ని టాటా సన్స్ తీసుకురానుంది. ఇందుకోసం..

TataNeu : 2 బిలియన్ డాలర్లతో టాటా నుంచి సూపర్ యాప్.. ఫస్ట్ లుక్ అదుర్స్

Tataneu

TataNeu : దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటైన టాటా గ్రూప్ నుంచి కొత్త యాప్ రానుంది. సూపర్ యాప్ TataNeu ని టాటా సన్స్ తీసుకురానుంది. ఇందుకోసం 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆ తర్వాత అదనంగా 5 బిలియన్ డాలర్లను బయటి ఇన్వెస్టర్ల నుంచి సేకరించనుంది. డిజిటల్ వెంటర్ లో స్వల్ప వాటాలు విక్రయించి నిధులు సేకరించనుంది.

TataNeu యాప్.. ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదికి దేశవ్యాప్తంగా లాంచ్ చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాప్ ను టాటా గ్రూప్ కి చెందిన అన్ని రకాల వ్యాపారాలకు సింగిల్ పాయింట్ డిజిటల్ డోర్ వే గా తీసుకురానున్నారు. హెల్త్ కేర్, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఆర్థిక సేవలు, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఓవర్ ద టాప్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, బిల్ చెల్లింపులు.. ఇలా టాటా ఆఫర్ చేసే అన్ని సేవలను ఈ యాప్ కిందకు తీసుకురానున్నారు.

Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!

ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్ మెంట్ ను 5 బిలియన్ డాలర్లకు పెంచనున్నారు. బయటి నుంచి నిధులను సేకరించనున్నారు. గ్లోబల్ పెన్షన్ ఫండ్స్, సావరిన్ ఫండ్స్, ఇన్సురెన్స్ కంపెనీల నుంచి ఫండ్స్ రైజ్ చేయనున్నారు. అదే సమయంలో టాటా మోటర్స్ ఇటీవలే తన ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ కోసం 1 బిలియన్ డాలర్లు సేకరించింది.

2021 ఆర్థిక సంవత్సరంలో టాటా సన్స్ లాభాలు 142 శాతం(రూ.6వేల 512కోట్లు) పెరిగాయి. అందులో ఆదాయం రూ.19వేల 598 కోట్లు. నెట్ డెబ్ట్ రూ.27వేల 615 కోట్లు.

బిగ్ బాస్కెట్, 1MG ఇతర యాప్స్ తరహాలోనే టాటా గ్రూప్ సూపర్ యాప్ తీసుకురానుంది. అందులో అన్ని రకాల బెనిఫిట్లు, ఎక్స్ క్లూజివ్ రివార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. టాటా ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. టాటా డిజిటల్ లోకి వెళ్లి వెబ్ యాప్ ని ట్రై చేయొచ్చు.

Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసుకోవాల్సిందే…

కాగా, టాటా న్యూ సూపర్ యాప్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోమ్ పేజీ ఆఫర్లతో నిండి ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. స్కాన్ అండ్ పే, సెండ్ మనీ, పే బిల్స్, ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. Shop & Explore సెక్షన్ లో మల్టిపుల్ ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.

గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, హోటల్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్ నెస్, లగ్జరీ, ఫైట్స్, ఎంటర్ టైన్ మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లేదా స్మార్ట్ ఫోన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే క్రోమా లేదా టాటా క్లిక్ నుంచి ఆఫర్లు, ప్రొడక్ట్స్ వివారాలు వస్తాయి. అంతేకాదు ఈ యాప్ ద్వారా హోటల్ రూమ్ బుక్ చేయడం చాలా తేలిక. ఫిట్ నెస్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ నుంచి ఫైట్లు, ఎంటర్ టైన్ మెంట్ వరకు ఇలా సమస్త సేవలను టాటా ప్రొవైడ్ చేయనుంది. ఫుడ్ అండ్ బెవరేజ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ లో అనేక ఆఫర్లు ఉన్నాయి.

ఇక వాలెట్ సెక్షన్ కి వస్తే.. అందులో కొత్త కార్డుని యాడ్ చేసుకుని బిల్స్ పే చేసుకునే ఆప్షన్ ఉంది. జనాల్లోకి వచ్చాక మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్ ద్వారా చేసే లావాదేవీలకు NeuCoins గెల్చుకోవచ్చు.