Nepal Plane Crash Incident : నేపాల్ విమాన ప్ర‌మాద ఘటన.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ భార‌త ప్ర‌యాణికుడు

నేపాల్‌లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్‌ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.

Nepal Plane Crash Incident : నేపాల్ విమాన ప్ర‌మాద ఘటన.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ భార‌త ప్ర‌యాణికుడు

NEPAL PLANE

Nepal Plane Crash Incident : నేపాల్‌లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్‌ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే ప్యాసింజర్ మరికాసేపట్లో విమానం మంటల్లో చిక్కుకుంటుందనగా వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అందులో అతను నవ్యుతూ కనిపించాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటుంది. ఆ తర్వాత నేలను ఢీకొని, మంటలు వ్యాపిస్తాయి.

ఈ దృశ్యాలన్నీ సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కు చెందిన సోను జైస్వాల్(29) లిక్కర్ వ్యాపారి. అనిల్ రాజ్ భర్ (28), విశాల్ శర్మ(23), అభిషేక్ సింగ్(23)లతో కలిసి జైస్వాల్ జనవరి 13న ఖాట్మాండ్ కు వెళ్లాడు. ఈ నలుగురు అక్కడి పశుపతినాథ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పారాగ్లైడింగ్ చేసేందుకు పొఖార బయలుదేరారు. జనవరి 15 ఆదివారం ఎతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్-72 విమానం ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో 68 మంది చనిపోయారు.

Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్‌ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్

మృతుల్లో అధిక మంది నేపాల్ కు చెందిన వారే ఉండటం గమనార్హం. మృతుల్లో రష్యా, కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశస్తులు కూడా ఉన్నారు. రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు.

సహాయక బృందాలు కొంతమంది ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. అది కాఠ్మాండూ నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. విమానానికి మంటలు అంటుకున్నాయి. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను వేరే చోటుకి మళ్లించారు.