Silver Medal : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. ఇప్పటికే హైజంప్‌లో రెండు పతకాలతో సత్తా చాటిన భారత్‌.. ఈ ఈవెంట్‌లో తన ఖాతాలో మరో పతకం సాధించింది.

Silver Medal : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం

Silver Medal

Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. ఇప్పటికే హైజంప్‌లో రెండు పతకాలతో సత్తా చాటిన భారత్‌.. ఈ ఈవెంట్‌లో తన ఖాతాలో మరో పతకం సాధించింది. హైజంపర్‌ ప్రవీణ్‌కుమార్‌ సిల్వర్‌ మెడల్‌తో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ మెడల్స్‌ సంఖ్య 11కు చేరుకుంది. రెండు గోల్డ్‌, ఆరు రజతం, మూడు కాంస్య పతకాలతో భారత్ క్రీడాకారులు మంచి జోరు మీదనున్నారు.

ఇక హైజంప్‌లో భారత్‌ అదరగోడుతోంది. మొన్న హైజంప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మరియప్పన్‌ తంగవేలు రజతం నెగ్గగా.. శరద్‌ కుమార్‌ కాంస్యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ప్రవీణ్‌కుమార్‌ సిల్వర్‌ మెడల్ సాధించడంతో ఈ ఒక్క ఈవెంట్‌లోనే భారత్‌కు మూడు మెడల్స్‌ వచ్చినట్లైంది.

టోక్యోకు ముందు అన్ని పారాలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాలు మొత్తం 12. కానీ ఈసారి మనోళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఒక్క పారా క్రీడల్లోనే భారత్‌.. గత పారాలింపిక్స్‌ అన్నింటిలో కలిపి సాధించిన పతకాల కన్నా కూడా ఎక్కువగా గెలిచే దిశగా సాగుతోంది. అథ్లెట్ల స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిన వేళ.. భారత్‌ పతకాల సంఖ్య అసాధారణ స్థాయిలో 11కి చేరుకుంది.