ISRO Launches 36 Satellites: ఇస్రో ఖాతాలో మరో విజయం.. 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం2 రాకెట్

ఇస్రో మరో ఘనతను సాధించింది. అత్యంత బరువైన ఎల్వీఎం3-ఎం2 రాకెట్ నిప్పులుచిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత 12గంటల 7 నిమిషాల 40 సెకన్లకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు.

ISRO Launches 36 Satellites: ఇస్రో ఖాతాలో మరో విజయం.. 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం2 రాకెట్

ISRO

ISRO Launches 36 Satellites: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. అత్యంత బరువైన ఎల్వీఎం3-ఎం2 రాకెట్ నిప్పులుచిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత 12గంటల 7 నిమిషాల 40 సెకన్లకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు. 8,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ రాకెట్ సుమారు ఆరు టన్నుల అత్యంత బరువుతో కక్ష్యలోకి దూసుకెళ్లింది. ఇస్రో చరిత్రలో సుమారు ఇంతటి బరువుతో ఎల్వీఎం3-ఎం2 రాకెట్ ను ప్రయోగించడం ఇదే తొలిసారి. ప్రయెగం విజయవంతం కావడంతో షార్ లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు అలింగనం చేసుకొని అభినందనలు చెప్పుకున్నారు.

ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు

ఇస్రో ప్రకారం.. మిషన్ 36వన్‌వెబ్ ఉపగ్రహాలతో అత్యంత బరువుతో ఈ రాకెట్ నింగిలోకి వెళ్లింది. జీఎల్ఎల్వీ -ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆదునీకరించి కొత్తగా లాంచ్ వెహికల్ ఎం3-ఎం2గా నామకరణం చేశారు. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి శాటిలైట్లనున పంపే రాకెట్లకే జీఎస్ఎల్వీగా పిలుస్తారు. అయితే శనివారం అర్థరాత్రి దాటిన తరువాత పంపించిన రాకెట్ జీటీవోకి పంపట్లేదు ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకు దీనిని వేరే పేరు పట్టారు. ఇదిలాఉంటే LVM3-M2 ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలో (భూమికి 1,200 కి.మీ ఎత్తులో) ఉంచడానికి ఈ ప్రయోగం మొదటిది.

ఇస్రో రాకెట్ ఎల్వీఎం3-ఎం2 మోసుకెళ్లిన ఈ ఉపగ్రహాలు లండన్‌కు చెందిన కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ (OneWeb)కి చెందినవి. ఇందులో భారతదేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన పెట్టుబడిదారు. ఇదిలాఉంటే .. ఇస్రో 31 చిన్న ఉపగ్రహాలను జూన్ 2017లో యూరోపియన్ దేశాల కోసం ప్రయోగించింది. ఆ సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మేము హాలీవుడ్ చిత్రం కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారక గ్రహానికి చేరుకున్నామని అన్నారు.

LVM3 ప్రయోగం తర్వాత ఇస్రో ఛైర్‌పర్సన్ S. సోమనాథ్ మాట్లాడుతూ .. ప్రయోగం విజయవంతమైందని, ఉపగ్రహాల విభజన ఖచ్చితంగా జరిగినందున షార్ కేంద్రంలోని వారందరికీ ఇది దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు. ఉపగ్రహాలన్నీ ఖచ్చితమైన ఉద్దేశించిన కక్ష్యలో ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ఎల్వీఎం-3ని ప్రయోగించడానికి మాపై నమ్మకం ఉంచినందుకు వన్‌వెబ్ (OneWeb) బృందానికి సోమనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలాఉంటే.. మిషన్ విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో బృందాన్ని ప్రశంసించారు.