Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

ఒమిక్రాన్‌ కారణంగా రోగిలో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొంటాయని, దీంతో రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

Omicron (1)

Antibodies in the Omicron patient : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న సమయంలో ఐసీఎంఆర్ అధ్యయనం శుభవార్త చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పేషెంట్‌లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిన వ్యక్తిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుందని అధ్యయనం పేర్కొంది.

ఒమిక్రాన్‌ కారణంగా రోగిలో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొంటాయని, దీంతో రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో డామినెంట్ వేరియంట్‌గా డెల్టా వేరియంట్ ఎంతో కాలం ఉండబోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ల తయారీ, పంపిణీ విధానాల్లోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.

Objections : ఏపీలో కొత్త జిల్లాలపై అభ్యంతరాలు

ఒమిక్రాన్ లక్ష్యంగా చేసుకుని టీకా వ్యూహాన్ని రూపొందించాలని సూచనలు చేసింది. 39 మంది వ్యక్తులపై ఐసీఎంఆర్‌ అధ్యయనం నిర్వహించింది. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు మోతాదుల టీకా తీసుకోగా.. ఎనిమిది మంది ఫైజర్‌ టీకాలు.. ఆరుగురు ఇప్పటి వరకు ఇంకా టీకాలు వేసుకోలేదు.

39 మందిలో 28 మంది యూఏఈ, దక్షిణ, పశ్చిమ, తూర్పు ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, అమెరికా, యూకే నుంచి తిరిగి వచ్చిన వారు కాగా.. 11 మంది వారి హై రిస్క్‌ కాంటాక్టులు. వీరందరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకింది. ఈ సందర్భంగా ఆయా వ్యక్తుల్లో యాంటీబాడీల ప్రతిస్పందనపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో గణనీయమైన ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ ఉన్నట్లు గుర్తించింది.