Arikomban Elephoent : ఎట్టకేలకు పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగు …

చేలల్లో ధాన్యం తినేసేది. ధాన్యం దొరకకపోతే ఇళ్లల్లోకి దూరి బియ్యం తినేసేది. దాన్ని తరమటానికి ఎవరైనా దగ్గరకొస్తే దాడికి దూసుకొచ్చేది. కేవలం బియ్యం మాత్రమే తినేసి వెళ్లిపోయేది అరి కొంబన్ ఏనుగు. దేశంలోనే ఓ అరుదైన జీవిగా గుర్తింపు పొందిన 35 ఏళ్ల ఈ మగ ఏనుగును అధికారులు ఎట్టకేలకు బంధించారు.

Arikomban Elephoent : ఎట్టకేలకు పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగు …

Arikomban Elephoent

Arikomban Elephoent : రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించి కనిపించినవారిపై దాడి చేస్తు ఒకరిని తొక్కి చంపేసిన ప్రమాదకరమైన ఏనుగు ఎట్టకేలకు చిక్కింది. గత కొన్ని నెలలు కేరళ (Kerala) లో భీభత్సం సృష్టిస్తూ తమిళనాడు (Tamil nadu)లోకి ప్రవేశించిన అరె కొంబన్ ఏనుగు (Arikomban Elephoent) దాడిలో ఎంతోమంది గాయపడ్డారు. ఒకరిని నిర్ధాక్ష్యిణంగా తొక్కి చంపేసింది. ఆహారం కోసం వరి చేనులలో దాడులకు తెగబడే అరి కొంబన్ ఏనుగు ఇటు తమిళనాడు, కేరళ ప్రజలను హడలెత్తించింది. వాహనాలను ధ్వంసం చేసింది. పంటలను నాశనం చేసింది.

చేలల్లో ధాన్యం దొరకకపోతే ఇళ్లల్లోకి దూరి బియ్యం తినేసేది. దాన్ని తరమటానికి ఎవరైనా దగ్గరకొస్తే దాడికి దూసుకొచ్చేది. కేవలం బియ్యం మాత్రమే తినేసి వెళ్లిపోయేది అరి కొంబన్ ఏనుగు. 35 ఏళ్ల ఈ మగ ఏనుగు దేశంలోనే ఓ అరుదైన జీవిగా గుర్తింపు పొందింది. దీంతో దీన్ని పట్టుకోవటానికి అధికారులు చేయని యత్నం లేదు. దానికి ఎటువంటి గాయం చేయకుండా ఏనుగును బంధించేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నం చేసిన అటవీ అధికారులు . కానీ చిక్కలేదు. అలా అటవీ శాఖ అధికారులు (Forest Department Officers)పలు రకాలుగా యత్నించి ఎట్టకేలకు తెల్లవారు జామున తిరునల్వేలి సమీపంలో ఏనుగు నిద్రిస్తుండగా మూడు మత్తు ఇంజెక్షన్లు (Anesthetic injections )ఇచ్చి పట్టుకున్నారు.

తిరునల్వేలి, థెని (Tirunalveli, Theni)లలో వాహనాలు, పంటలు ధ్వంసం చేసిన ఈ ఏనుగు దాడికి ఒకరు మృతి చెందారు. మరో 11 మందికి గాయపడ్డారు. అరె కొంబన్ ఏనుగు పట్టుబడడంతో ఊపిరి పీల్చుకొన్న స్దానికులు. గత కొన్ని నెలలుగా తమిళనాడు (Tamil nadu), కేరళ (Kerala) సరిహద్దు జిల్లా (Borarder Distrct)ల ప్రజలను నిద్ర లేకుండా చేసింది ఈ మగ ఏనుగు. ఒకరిని తొక్కి చంపేసింది.11 మందిని గాయపరిచింది.ఎన్నో వాహనాల్ని, పంటలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించి వార్తల్లోకెక్కిందీ అరికొంబన్ ఏనుగు. కేరళ (Kerala) నుంచి తమిళనాడు (Tamilnadu)లోని తిరునల్వేలి జిల్లా(Tirunalveli Distrcit)లో ప్రవేశించాక ఈ ఏనుగును పట్టుకోవటానికి కేరళ, తమిళనాడు అటవీశాఖ అధికారులు (Forest Officers) సంయుక్తంగా ప్లాన్స్ వేసి ఎట్టకేలకు నిద్రపోతున్న దాన్ని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి పట్టుకున్నారు.

సోమవారం (జూన్ 6,2023) తెల్లవారుజామున తమిళనాడులోని తిరునల్వేలిలో కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం అరికొంబన్ ఏనుగును పట్టుకున్నారు. ఆ తరువాత మూడు కుమ్కీ ఏనుగుల సహాయంతో అరి కొంబన్ ఏనుగును ట్రక్కులో ఎక్కించి తేని జిల్లాకు ఆనుకుని ఉన్న వెల్లిమలై ప్రాంతంలో విడిచిపెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ ఏనుగుకు పలు గాయాలు కావటంతో దానికి చికిత్స చేసి ఆ తరువాత అడవిలో విడిచి పెట్టాలని భావిస్తున్నారు.

ఈ ఏనుగును కేరళ అటవీ శాఖ 2023 ఏప్రిల్ 29న కేరళ, తమిళనాడు అంతర్రాష్ట్ర సరిహద్దులోని పెరియార్ టైగర్ రిజర్వ్‌లో మార్చింది. ఇటీవల ఇది తమిళనాడు అడవుల్లోకి ప్రవేశించి…మెగామలై లోయర్ క్యాంప్, కంబం, సురులపట్టి, యానై గజం, కూతనాచ్చి అటవీ రేంజ్‌లలో నానా బీభత్సం సృష్టించింది.