3 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం : ఆర్మీచీఫ్.జనరల్. బిపిన్ రావత్ 

  • Published By: chvmurthy ,Published On : October 20, 2019 / 04:05 PM IST
3 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం : ఆర్మీచీఫ్.జనరల్. బిపిన్ రావత్ 

పీవోకే లోని  ఉగ్రవాద స్దావరాల పై భారత సైన్యం ఆదివారం, అక్టోబరు20న జరిపిన దాడిలో 6నుంచి 10 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు.  వీరితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని ఆయన తెలిపారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలు లక్ష్యంగా భారత్ సైన్యం దాడులు చేసిందని. వాటిలో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరొకటి స్వల్పంగా ధ్వంసమైందని ఆయన చెప్పారు.

జురా, అత్ముకమ్, కుండల్సాహి  ప్రాంతాల్లోని స్థావరాల్లో ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందిందని బిపిన్ రావత్ చెప్పారు. భారత సేనల దృష్టి మరల్చి.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఆదివారం ఉదయం సరిహద్దు దాటించాలన్న కుట్రతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, పాక్ కాల్పులకు దిగింది. తాంగ్ధర్ సెక్టార్ లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఒక సామాన్యుడు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగి పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్  ఇచ్చింది.

తాంగ్ధర్ సెక్టార్ లో  జరిగిన కాల్పుల విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు  ఫోన్ చేసి ప్రస్తుత పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం.