దేశం కోసం : ఆర్మీలోకి ‘మిస్ ఇండియా ఛార్మింగ్’

దేశం కోసం : ఆర్మీలోకి ‘మిస్ ఇండియా ఛార్మింగ్’

అందాల ప్రపంచాన్ని కాదని ఆర్మీలోకి చేరింది ఓ అమ్మాయి. గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలని చాలామంది యువతులు కలలు కంటుంటారు.

దేశం కోసం : ఆర్మీలోకి ‘మిస్ ఇండియా ఛార్మింగ్’

అందాల ప్రపంచాన్ని కాదని ఆర్మీలోకి చేరింది ఓ అమ్మాయి. గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలని చాలామంది యువతులు కలలు కంటుంటారు.

అందాల ప్రపంచాన్ని కాదని ఆర్మీలోకి చేరింది ఓ అమ్మాయి. గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలని చాలామంది యువతులు కలలు కంటుంటారు. దాని కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందాల పోటీలలో పాల్గొంటారు. ఆ అందాల కిరీటం సొంతం అయిన వేళ వారు పొందే భావోద్వేగం మాటల్లోవర్ణించలేనిది. తాము అనుకున్నది సాధించామనే సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. కానీ ఆ అందాల లోకంలో 2017లో ‘మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్’ దక్కించుకుని ఇప్పుడు పూర్తి భిన్నమైన ఇండియా ఆర్మీలోకి అడుగుపెట్టింది ఓ అందాల బొమ్మ. ఆమే హర్యానాకు చెందిన గరిమా యాదవ్. 
Read Also : హోళీ ఇలా చేస్తే అద్భుతం: అసలైన హోళీ ఇదే

గరిమా యాదవ్ షిమ్లాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. తర్వాత దేశ రాజధానిలోని ఢిల్లీ సెయింట్ స్టిఫెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామ్ లో పాస్ అయ్యి..చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ)లో ట్రైనంగ్ తీసుకుంది. ఓ పక్క చదువు..మరో పక్క అందాల పోటీల్లోనూ రాణించింది. ఈ క్రమంలో 2017లో ‘మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్’లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. కానీ ఆ అందాల లోకంలో  వైపు వెళ్లలేదు. భారత సైన్యంలో చేరాలనే పట్టుదలతో తన కఠినమైన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. 

ఓటీఏలో శిక్షణ పొందడం ఎంతో గొప్ప అనుభూతి అనీ..ట్రైనింగ్ చాలా కఠినమైనదనీ..అందాల పోటీల గురించి నాజూకుగా తయారైన తాను ట్రైనింగ్ సమయంలో ఫిజికల్ గా చాలా కష్టపడ్డానని తెలిపింది. అలాగని ట్రైనింగ్ మధ్యలో వదిలిపెట్టకుండా విజయవంతంగా పూర్తి చేసుకున్నాననీ సంతోషంగా చెప్పింది. మనలో ఉన్న పట్టుదలే కఠినమైన సమస్యలను..సందర్భాలను అధిగమించేలా చేస్తుందనీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు తాను అది గమనించాలని తెలిపింది.రోజు రోజుకు మరింత సామర్థ్యాన్ని సొంతం చేసుకునే ఎవరైనా సరే విజయాన్ని సాధిస్తారని తెలిపింది. ‘మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్’ దక్కించుకుని ఆర్మీలోకి అడుగుపెట్టిన గరిమా యాదవ్. 
Read Also : హోటల్ బిల్లు కట్టని ప్రముఖ నటి : రూ.3.5లక్షలు పెండింగ్

×