Hyderabad: ఐబీఎస్‌ కళాశాలలో విద్యార్థిపై దాడి .. వీడియో వైరల్.. కేసు నమోదు చేసిన పోలీసులు

బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.

Hyderabad: ఐబీఎస్‌ కళాశాలలో విద్యార్థిపై దాడి .. వీడియో వైరల్.. కేసు నమోదు చేసిన పోలీసులు

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని ఐబీఎస్ కళాశాల క్యాంపస్‌లో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌ను ఇన్‌స్టిట్యూట్‌లోని ఇతర విద్యార్థులు దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో .. హాస్టల్ గదిలో బన్సల్‌ను కొందరు యువకులు కొట్టడం, బెదిరించడం వంటి దృశ్యాలు చూడవచ్చు. దాడి తరువాత.. బన్సల్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై దాడికి దారితీసిన పరిస్థితులను ఫిర్యాదులో వివరించాడు.

Fighter Planes Collide: ఎయిర్ షో సమయంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్

బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న తన స్నేహితుల్లో ఒకరు తన కంటే మూడున్నరేళ్లు చిన్న అమ్మాయితో స్నేహం చేస్తున్నందుకు తనను తిట్టారని బన్సల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది కుర్రాళ్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని, నన్నుకొట్టేటప్పుడు అల్లా-హు-అక్బర్ అని చెప్పాలని హెచ్చరించారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టడమే కాకుండా తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు హిమాంక్ బన్సాల్‌పై కూడా ఇన్సిట్యూట్ చర్యలు ప్రారంభించింది.