Baby Shower For Pet Dog : పెంపుడు కుక్కకు గ్రాండ్ గా సీమంతం

  తమిళనాడులోని ఓ పోలీస్ సబ్​ఇన్‌స్పెక్టర్‌ తమ పెంపుడు కుక్కకి వైభవంగా శీమంతం చేశారు. అంతేకాకుండా, సన్నిహితులను,పొరుగింటివారిని ఆహ్వానించి ఘనంగా ఈ వేడుక చేశారు. కుక్కకు సీమంతం

10TV Telugu News

Baby Shower For Pet Dog :  తమిళనాడులోని ఓ పోలీస్ సబ్​ఇన్‌స్పెక్టర్‌ తమ పెంపుడు కుక్కకి వైభవంగా శీమంతం చేశారు. అంతేకాకుండా, సన్నిహితులను,పొరుగింటివారిని ఆహ్వానించి ఘనంగా ఈ వేడుక చేశారు. కుక్కకు సీమంతం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధురై సిటీ పరిధిలోని జైహింద్‌పురం పోలీస్ స్టేషన్ లో సబ్​ఇన్‌స్పెక్టర్‌ గా విధులు నిర్వహించే వీ. శక్తివేల్ కు చిన్నప్పటి నుంచి శునకాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మూడేళ్ల నుంచి ఓ కుక్కకు ప్రేమగా సొంత బిడ్డ మాదిరిగా పెంచుకుంటున్నాడు. ఆ పెంపుడు కుక్కకి “సుజీ”అని పేరు పెట్టింది శక్తివేల్ కుటుంబం. శక్తివేల్ కుటుంబ సభ్యులు ఏ ఆహారం తింటే..సుజీకి కూడా అదే పెట్టేవారు. శక్తివేల్ కుటుంబంలో సుజీ ఒకటిగా కలిసిపోయింది.

అయితే ఇటీవల సుజీ గర్భం దాల్చడంతో దానికి వైభవంగా సీమంతం చేయాలని నిర్ణయించి శక్తివేల్ కుటుంబం ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సుజీకి పూలమాల వేసి అలంకరించారు. ఐదు రకాల బియ్యంతో వంటలు చేసి తినిపించారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకకు ఇరుగు పొరుగువారు, స్నేహితులు, సహచరులను కూడా ఆహ్వానించి భోజనాలు పెట్టారు. సీమంతానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు.. సుజీకి కుంకుమ రాసి, గాజులు వేశారు. హారతి ఇచ్చి సుజీని ఆశీర్వదించారు. డిసెంబరు 11 లేదా 12లోపు సుజీకి సురక్షితమైన డెలివరీ అవుతుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా శక్తివేల్ తెలిపారు.

ALSO READ Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్

×