Basavaraj Bommai: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ఖ‌రార‌య్యారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశాల్లో బసవరాజు బొమ్మై రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

Basavaraj Bommai: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

Bommai (1)

Basavaraj Bommai: క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ఖ‌రార‌య్యారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశాల్లో బసవరాజు బొమ్మై రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రేపు(జూలై 28) మధ్యాహ్నం 3.20 గంటలకు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో కర్నాటక రాష్ట్ర 30వ ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న బొమ్మై, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2008లో జ‌న‌తాద‌ళ్ నుంచి బీజేపీలో చేరిన బొమ్మై, య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వంలో హోంశాఖ మంత్రిగా ప‌నిశారు. మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన బ‌స‌వ‌రాజు పారిశ్రామిక వేత్త‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్య‌వ‌సాయ రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చిన నేత‌గా బొమ్మై కుటుంబానికి క‌ర్నాట‌క‌లో గుర్తింపు ఉంది.

తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంపై బొమ్మై ఆనందం వ్యక్తం చేశారు. శాసనసభ్యులందరూ నన్ను నమ్మకంగా ఎన్నుకున్నారు. యడియూరప్ప నాపై నమ్మకంతో ఆశీర్వదించారు. నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యడియూరప్పలకు కృతజ్ఞతలు” అని బసవరాజా బొమ్మై అన్నారు.