Madhya Pradesh : తోపుడు బండిపై భిక్షాటన కష్టంగా ఉందని మోపెడ్ కొనుక్కున్న యాచక దంపతులు

ఓ యాచకుడు తన భార్యకు ఓ మోపెడ్ బండి బహుమతిగా ఇచ్చాడు. తోపుడు బండిపై  తిరుగుతు భిక్షాటన చేయటానికి భార్య పడే కష్టాన్ని చూడలేక ఆ భిక్షగాడు భార్యకు ఓ మోపెడ్ బండి కొని బహుమతి ఇచ్చాడు.

Madhya Pradesh : తోపుడు బండిపై భిక్షాటన కష్టంగా ఉందని మోపెడ్ కొనుక్కున్న యాచక దంపతులు

Beggar Gifts Wife A Moped Worth Rs.90000

beggar gifts wife a moped worth Rs.90000 : ఓ యాచకుడు తన భార్యకు ఓ మోపెడ్ బండి బహుమతిగా ఇచ్చాడు. తోపుడు బండిపై  తిరుగుతు భిక్షాటన చేయటానికి భార్య పడే కష్టాన్ని చూడలేక ఆ భిక్షగాడు భార్యకు ఓ మోపెడ్ బండి కొని బహుమతి ఇచ్చాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింధ్వారా జిల్లా అమ‌ర‌వ‌ర గ్రామంలో నాలుగేళ్లపాటు భిక్షాటన చేసిన డబ్బుల్ని పొదుపు చేసి భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. దీంతో ఎంచక్కా ఆ బండిమీద తిరుగు భిక్షాటన చేస్తున్నారు సంతోష్ సాహు అనే యాచకుడు అతని భార్య కలిసి..

సంతోష్ సాహు అనే యాచ‌కుడికి రెండు కాళ్లు ప‌నిచేయ‌వు. భార్య మున్నిసాహుతో క‌లిసి మూడు చక్రాల బండిమీద తిరుగుతు వీధుల వెంట తిరుగుతూ సంతోష్ సాహు యాచించే వాడు. అలా సంతోష్ సాహు ఆ మూడు చక్రాల (లోపుడు బండివంటిది) కూర్చుంటే భార్య మున్నిసాహు తోస్తుండేది. అలా ఇద్దరు కలిసి భిక్షాటన చేసేవారు. రోజంతా ట్రైసైకిల్ తోసుకుంటూ వెళ్లాల్సి రావడంతో అతని భార్య తరచూ అనారోగ్యం పాలవుతుండేది. ఇది చూసిన సంతోష్ మోపెడ్ కొనాలని నిర్ణయించుకున్నాడు.

మున్ని సాహు ట్రైసైకిల్‌ను తోస్తుండ‌గా గుళ్లు, మ‌సీదులు, బ‌స్టాండ్‌ల వ‌ద్ద రోజూ యాచ‌క వృత్తితో జీవించేవాడు. అలా సాహు దంప‌తులు రోజుకు రూ 300 నుంచి రూ 400 వ‌ర‌కూ సంపాదించేవారు. మొత్తంమీద నాలుగేండ్ల‌లో రూ 90,000 న‌గ‌దు పోగేసిన సంతోష్ సాహు మోపెడ్‌ను కొనుగోలు చేయ‌గా ఇప్పుడు ఆ దంప‌తులు మోపెడ్‌పై భిక్షాట‌న చేస్తున్నారు.