Agnipath : ‘అగ్నిపథ్’స్కీమ్ పై భగ్గుమన్ననిరుద్యోగులు..నాలుగేళ్ల తరువాత మా పరిస్థితేంటీ?అంటూ ఆగ్రహం

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. తీవ్ర నినసనలు చేపట్టారు.

Agnipath : ‘అగ్నిపథ్’స్కీమ్ పై భగ్గుమన్ననిరుద్యోగులు..నాలుగేళ్ల తరువాత మా పరిస్థితేంటీ?అంటూ ఆగ్రహం

Unemployed Youth Protests Over New Agnipath Scheme For Military Jobs

Agnipath : త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత తీవ్ర నినసన గళం వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం (15,2022) రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ (Agnipath) పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లు సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ యువకులు మండిపడుతున్నారు.

బీహార్, జార్ఖండ్ లతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు.బీహార్ లోని ముజఫర్ పూర్ , బక్సర్, బెగూసరాయ్ లో భారీగా రోడ్లమీదకు వచ్చిన యువత నిసనలు చేపట్టారు. భారీగా ఉద్యోగాలు ప్రకటించామని కేంద్రం గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఇది నిరుద్యోగులకు ఏమాత్రం శాశ్వత పరిష్కారం చూపినట్లు కాదని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతకు నాలుగు ఏళ్లపాటు ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ యువతను ప్రభుత్వం పిచ్చివాళ్లను చేస్తోంది అంటూ ఫైర్ అవుతున్నారు. పలు ప్రాంతాల్లో యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. రోడ్లపై టైర్లు దగ్థం చేశారు. చాప్రాలో యువత నిరసనలు విధ్వంసానికి దారితీశాయి. ముఖ్యంగా ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం ప్రిపేర్అవుతున్న యువత ఈ ‘అగ్నిపథ్’పథకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also read : Agnipath Recruitment Scheme : ఆర్మీలో యువ‌త‌కు అవకాశం..‘అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్’ ప్ర‌క‌టించిన ర‌క్ష‌ణ‌శాఖా మంత్రి

అగ్నిపథ్‌ పథకంపై వ్యతిరేకతలు..
అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తున్న యువత నాలుగేళ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందన్నారు. భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్‌ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలంటూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ కొత్త పథకంపై కొందరు అనుభవజ్ఞులతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశానికి గానీ, యువతకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా విమర్శించారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. సాయుధ దళాల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న సైనికులకు వారి ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలుగా హేతుబద్ధీకరించేలా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై విశ్రాంత మేజర్‌ జనరల్‌ బీఎస్‌ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్‌ చేస్తూ..కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని సూచించారు. ఇలా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Also read :  Agnipath Scheme : ‘అగ్నిపథ్’ పేరుతో సరికొత్త పథకం..4 ఏళ్ల సర్వీస్ కోసం యువతను సైన్యంలో చేర్చుకునే స్కీమ్

కొత్త రిక్రూట్‌మెంట్ ప్రణాళిక..
కొత్త రిక్రూట్‌మెంట్ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గించుకోవడంతో పాటు ఆయుధాల సేకరణ కోసం అధిక నిధులు వెచ్చించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కేంద్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 46 వేల మందిని నాలుగేళ్ల సర్వీసుపై నియమించుకోనుంది. నెలవారీగా రూ.30 నుంచి 40వేల మధ్య (ఇతర అలవెన్సులు మినహాయించి) చెల్లించనున్నారు. వీటితో పాటు వైద్య, బీమా సదుపాయం కూడా కల్పిస్తారు.

నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15 ఏళ్ల పాటు నాన్‌ ఆఫీసర్‌ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. పెన్షన్‌ ప్రయోజనాలు కూడా లేవు.