Quality Education: చక్కని విద్య కావాలంటూ సీఎంకు కన్నీళ్లతో బాలుడి వినతి

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు శనివారం 6వ తరగతి విద్యార్థి అయిన 11 ఏళ్ల బాలుడు షాక్ ఇచ్చాడు. ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న సీఎం అక్కడి ప్రజలను కలుసుకుంటుండగా విద్యార్థి సీఎం దగ్గరకు వచ్చి..

Quality Education: చక్కని విద్య కావాలంటూ సీఎంకు కన్నీళ్లతో బాలుడి వినతి

Quality Education

Quality Education: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు శనివారం 6వ తరగతి విద్యార్థి అయిన 11 ఏళ్ల బాలుడు షాక్ ఇచ్చాడు. ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న సీఎం అక్కడి ప్రజలను కలుసుకుంటుండగా విద్యార్థి సీఎం దగ్గరకు వచ్చి.. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని వేడుకున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చక్కని చదువుకునేందుకు వీలుగా లేదని వాపోయాడు.

నలంద జిల్లాలోని సీఎం స్వగ్రామమైన కళ్యాణ్‌బిఘ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

“సార్! నా మాట వినండి…నేను చదువుకోవాలనుకుంటున్నా. దయచేసి సహాయం చేయండి. నీమా కౌల్‌ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఎలా అందించాలో ఉపాధ్యాయులకు తెలియడం లేదు’’ అని సీఎంకు చెప్పి ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: కొత్త పార్టీ ఇప్పట్లో లేదు.. బీహార్‌లో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తా

11 ఏళ్ల బాలుడి ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్న సీఎం.. చదువుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

తన తండ్రి రణవిజయ్ యాదవ్ పెరుగు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడని సోనూ చెప్పాడు. అలా సంపాదించిన మొత్తాన్ని మద్యం తాగడానికే వినియోగిస్తున్నాడని వెల్లడించాడు. అందుకే ప్రైవేటు పాఠశాలలో చేరేందుకు మా వద్ద డబ్బులు లేవని మీడియాకు వివరించాడు.