ఆ బైక్ కు రూ.23వేల ఫైన్ : కొత్త ఫైన్స్ తో దేశం షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2019 / 01:19 PM IST
ఆ బైక్ కు రూ.23వేల ఫైన్ : కొత్త ఫైన్స్ తో దేశం షాక్

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారు.. హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు అలా పడేసి వెళ్లిపోయేవారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఓ వెయ్యి కొట్టి వెళ్లిపోయేవారు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి లెక్క మారింది. కొత్త మోటార్ వెహికల్ చట్టం ఏ స్థాయిలో ఉందో.. జరిమానాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్క రోజులోనే అనుభవంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది. 
ఒక్కసారి దొరికితే 23వేల ఫైన్ ఎలా పడిందో చూద్దాం :
1.    బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు : రూ.10వేల ఫైన్
2.    డ్రైవింగ్ లైసెన్స్ లేదు : రూ.5వేల ఫైన్
3.    బండికి ఆర్సీ లేదు (నెంబర్ లేదు) : రూ.5వేల ఫైన్
4.    ఇన్సూరెన్స్ లేదు : రూ.2వేల ఫైన్
5.    హెల్మెట్ పెట్టుకోలేదు : రూ.వెయ్యి ఫైన్
ఈ బండి నడిపింది వ్యక్తి పేరు మదన్. ఢిల్లీ నివాసి. గురుగ్రామ్ లో పని ఉంటే బైక్ పై వస్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపి.. డాక్యుమెంట్లు అడిగారు. లేవని సమాధానం ఇచ్చాడు. అంతే.. వన్ బై వన్ జరిమానాలు విధించారు. చీటిలో చేతిలో పెట్టారు. 23వేల రూపాయలు. షాక్ అయ్యాడు. ఇంత కట్టలేనని స్పష్టం చేశాడు.. బండి సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చి పంపించారు. కొత్త మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన లేదని చెబుతున్నాడు మదన్. కొత్త చట్టంతో మొదటిసారి భారీ ఫైన్ పడిన వ్యక్తిగా మదన్ రికార్డుల్లోకి ఎక్కాడు. 
బీకేర్ ఫుల్ రైడర్స్.. డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ గా ఉంటేనే బండి తీయండి.. తోలండి. లేకపోతే జరిమానాలు కట్టటానికి బైక్ అమ్మినా ఆ డబ్బులు సరిపోవు.