Union Budget 2022 : ఇది గరీబ్ కళ్యాణ్ బడ్జెట్, దేశాభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్

ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.

Union Budget 2022 : ఇది గరీబ్ కళ్యాణ్ బడ్జెట్, దేశాభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్

Union Budget 2022

Union Budget 2022: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్… గరీబ్ కళ్యాణ్ బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ, కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించబడిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్ చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తుందని నడ్డా అన్నారు. ఇది కేవలం ఏడాది అభివృద్ధి అజెండా కాదని, రాబోయే 25 ఏళ్లలో దేశాభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్ అని నడ్డా అన్నారు.

Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి.

ఇలా వరుసగా నాలుగేళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఘనత సాధించారు. ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మల. ఇప్పటివరకు ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్‌ (10 సార్లు) పేరు మీద ఉంది. ఆ తర్వాత చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ 9 సార్లు.. యశ్వంత్‌రావు చౌహాన్‌, సీడీ దేశ్ ముఖ్‌ 7 సార్లు.. టీటీ కృష్ణమాచారి, మన్మోహన్‌ సింగ్‌ 6 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

బడ్జెట్ అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశతో చూస్తారు. కానీ అవేం నెరవేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఆదాయంపై ప్రభావం చూపించే నిర్ణయాలకు దూరంగా కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలకు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.

High Court: ఉద్యోగస్తుల నుంచి రికవరీ చేయొద్దు.. పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

కాగా, బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను పరంగా కేంద్రం ఎటువంటి ఊరట కల్పించ లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలోనూ పన్నుపరంగా ఎటువంటి ఉపశమనం లేదన్నారు.