Arvind Kejriwal: ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.800 కోట్లు కేటాయించిన బీజేపీ: అరవింద్ కేజ్రీవాల్

తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Arvind Kejriwal: ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.800 కోట్లు కేటాయించిన బీజేపీ: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: తన పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గురువారం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశానికి ముందు ఆయన ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్మారక స్థలమైన రాజ్‌ఘాట్ సందర్శించారు.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని తమ ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటోందని విమర్శించారు. ‘‘సీబీఐ దాడుల తర్వాత బీజేపీ నేతలు, మనీష్ సిసోడియాను కలిశారు. కేజ్రీవాల్‌కు వెన్నుపోటు పొడిస్తే.. సీఎం పదవి ఇస్తామని ఆశ చూపారు. అదృష్టవశాత్తు ఆయనకు సీఎం పదవిపై ఆశ లేదు. ఆప్ ఎమ్మెల్యేలు.. బీజేపీకి అమ్ముడుపోవడం కంటే చావడం మేలనుకుంటున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చేందుకుగాను, మొత్తం రూ.800 కోట్లు బీజేపీ కేటాయించింది’’ అని కేజ్రీవాల్ వెల్లడించారు.

Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం తన పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమను బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని, ఆప్ నుంచి బయటకు రావాలని సూచించినట్లు 12 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌కు వివరించారు. ఈ సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు నేరుగా హాజరుకాగా, మిగతా ఎమ్మెల్యేలు ఆన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొన్నట్లు ఆప్ వెల్లడించింది.