Bihar liquor consumption: మద్యపాన నిషేధం ఉన్న బిహార్‌లో మళ్ళీ కల్తీ మద్యం కలకలం

Bihar liquor consumption: మద్యపాన నిషేధం ఉన్న బిహార్‌లో మళ్ళీ కల్తీ మద్యం కలకలం

adulterated liquor

Bihar liquor consumption: సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బిహార్‌లో అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కొందరు వ్యాపారులు. కల్తీ మద్యం తాగి మందుబాబులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, బిహార్ లోని సివాన్, లకరీ నబిగంజ్ లో కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు.

మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం తాగిన కాసేపటికే ఒకరు మృతి చెందారని, మరొకరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల పోస్టుమార్టం అనంతరం దీనిపై పూర్తి స్పష్టత రానుందని వివరించారు. మృతుల పేర్లు జనక్ ప్రసాద్, నరేశ్ బీన్ గా గుర్తించామని వారు బాలా గ్రామానికి చెందిన వారని తెలిపారు.

ప్రస్తుతం మరో ఐదుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బిహార్ లో కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు ఇవ్వడం లేదు. తరుచూ ఏదో ఓ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికీ కొందరు వ్యాపారులు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మద్యం తయారు చేస్తున్నారు. మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Doctor left bandage inside body: ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వలిదేసిన డాక్టర్.. మహిళ మృతి