బ్రేకింగ్ : పైలెట్ కు కరోనా…మాస్కోకు బయలుదేరిన విమానం తిరిగి ఢిల్లీకి

బ్రేకింగ్ : పైలెట్ కు కరోనా…మాస్కోకు బయలుదేరిన విమానం తిరిగి ఢిల్లీకి

ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరిన ఎయిరిండియా AI-1945 విమానంలో ప్రయాణం మధ్యలోనే తిరిగి వెనుకకు వచ్చేసింది. మాస్కోకు విమానం బయలుదేరిన తర్వాత పైలెట్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గ్రౌండ్ టీమ్ గుర్తించింది. దీంతో వెంటనే విమానం వెనుదిరిగి ఢిల్లీకి చేరుకుంది.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ పేరుతో విమానయానశాఖ నడుపుతున్న నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్ లలో ఇది ఒకటి. కరోనా నేపథ్యంలో మార్చిలో అంతర్జాతీయ విమానసర్వీసులను కేంద్రం నిలిపేయగా…కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ వాటిని పునరుద్దరించలేదన్న విషయం తెలిసిందే. కాగా,మే-25నుంచి దేశీయ విమాన ప్రయాణ సర్వీసులు పునరుద్దరించబడ్డాయి.

Read:విదేశీ మంత్రిత్వశాఖలో ఇద్దరికి కరోనా పాజిటివ్