జంబలకడిపంబ నిజమే : మగాళ్లకు తాళికట్టేశారు!

తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతుంది.

  • Published By: sreehari ,Published On : March 18, 2019 / 10:56 AM IST
జంబలకడిపంబ నిజమే : మగాళ్లకు తాళికట్టేశారు!

తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతుంది.

తాళికట్టు శుభవేళ… మెడలో కల్యాణమాల.. తరాలు మారాయి. రోజులు మారాయి.. సాంప్రదాయాలు కూడా నెమ్మదిగా మారిపోతున్నాయి. మనుషుల ఆలోచనలతో పాటు ఆచార సాంప్రదాయలనూ మార్చేస్తున్నారు. తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సాంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడైనా వధువు వరుడికి తాళి కట్టడం చూశారా? ఎక్కడ చూసి ఉండరు..

ఒక్క జంబలకడి పంబ సినిమాలో తప్ప. కదా.. అయితే ఇప్పుడు రియల్ గానే జరిగింది. ఇద్దరు పెళ్లికూతుళ్లు తమ భర్తలకు మంగళసూత్రాన్ని కట్టేశారు. మంగళసూత్రం ఎప్పుడు మగాళ్లే కట్టాలా? అది మగాళ్ల హక్కు ఏమైనా?.. లింగ సమానత్వానికి అద్దం పట్టేలా పెళ్లికూతుళ్లే పెళ్లికొడుకులకు తాళి కట్టారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.
Read Also : 600 కుక్కలు ఆత్మహత్య : మిస్టరీ వంతెన

అది ఎక్కడో కాదు.. కర్ణాటకలోని నలట్వాడ్ టౌన్ విజయపుర జిల్లాలో అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి తొలిమెట్టుగా ఈ పెళ్లితంతు జరిగింది. అతిథులు, పెళ్లి మంత్రాలు, భాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య పెళ్లికొడుకుల మెడలో పెళ్లికూతుళ్లు తాళి కట్టారు. రెండు నూతన జంటల్లో తొలి జంట పేర్లు.. అమిత్, ప్రియ.. ఈ జంట లింగాయత్, కుర్బా కమ్యూనిటీకి చెందినవారు.

వధువరులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగులే. పాత సాంప్రదాయానికి స్వస్తిపలికి నూతన సాంప్రదాయానికి వెల్ కం చెబుతూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రెండో నూతన జంట.. ప్రభురాజ్, అంకిత… వీరిద్దరూ కూడా వేర్వేరు కమ్యూనిటీలకు చెందినవారు.

పాత సాంప్రదయానికి భిన్నంగా పెళ్లి చేసుకుని 12ఏళ్ల లింగాయత్ కమ్యూనిటీకి భిన్నంగా ఐకాన్ బసవన్నలింగ సమానత్వానికి ప్రతీకగా ఈ పెళ్లి తంతును నడిపించారు. ఈ రెండు జంటల పెళ్లివేడుకకు వేలాది మంది అతిథులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. 
Read Also : ఓరి ద్యావుడా : చచ్చిన ఎలుకలతో వైన్, గబ్బిలాల సూప్