Rajasthan : డ్యాన్సులు వేస్తూ హోళీ సంబ‌రాలు చేసుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు

డ్యాన్సులు వేస్తూ రంగులకేళీ హోళీ సంబ‌రాలు చేసుకున్నారు బీఎస్ఎఫ్ జ‌వాన్లు.

Rajasthan : డ్యాన్సులు వేస్తూ హోళీ సంబ‌రాలు చేసుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు

Rajasthan And Punjab Bsf Soldiers Celebrate Holi Festival

Rajasthan and Punjab BSF Soldiers celebrate holi Festival : దేశ‌వ్యాప్తంగా హోళీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రంగులు చల్లుకుంటూ వర్ణాల కేళీలో మునిగితేలిపోతున్నారు ప్రజలు. దేశ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు కూడా రంగుల పండుగ‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ.. పాటలు పాడుతూ… డ్యాన్సులు వేసుకుంటే ఫుల్ ఖుషీగా వర్ణాల కేళీలో తేలిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ ద‌ళం రంగ్‌దే అంటూ హోళీ రంగులను చల్లుకుంటూ ఆనందోత్సాహంలో తేలిపోతున్నారు. ఇక పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉన్న 73 బెటాలియ‌న్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో కూడా బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స‌భ్యులు హోళీ డ్యాన్స్ చేశారు. ప్ర‌తి పండుగ‌ను తాము కుటుంబం కలిసి ఎలా సంతోషంగా గడుపుతామో అలాగే తాము ప్రతీ పండుగను ఇలా ఎంజాయ్ చేస్తామ‌ని బీఎస్ఎఫ్ జ‌వాన్లు చెబుతున్నారు.