Karnataka : బస్సు నడుపుతుండగా గుండె పోటుతో డ్రైవర్ మృతి.. పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన వాహనం
ప్రయాణీకులను దింపి వేసిన అనంతరం బస్సు సిందగి బస్సు డిపోకు వెళ్తోంది. ఖాళీ బస్సు సిందగి నగరంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మురిగెప్ప గుండెపోటు వచ్చింది.

Heart Attack Driver Died
Heart Attack Bus Driver Died : కర్నాటకలో విషాదం నెలకొంది. బస్సును నడుపుతుండగా గుండె పోటుకు గురై డ్రైవర్ మృతి చెందారు. డ్రైవర్ గుండె పోటుకు గురవ్వడంతో బస్సు అదుపు కోల్పోవడంతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. అనంతరం కొద్ది నిమిషాలకే బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన విజయనగర జిల్లాలో సిందగి నగర్ లో మంగళవారం చోటు చేసుకుంది.
మృతుడిని కేఎస్ఆర్టీసీ డ్రైవర్ మురిగెప్ప అథనిగా గుర్తించారు. కేఎస్ఆర్టీసీ బస్సు అఫ్జల్ పూర్ నుంచి విజయపుర వెళ్తుండగా డ్రైవర్ కు గుండె పోటు వచ్చింది. అయితే, ఈ ఘటనకు ముందు హెడ్ లైట్ సమస్యతో బస్సు రోడ్డుపై నిలిచిపోయింది.
దీంతో ప్రయాణీకులను దింపి వేసిన అనంతరం బస్సు సిందగి బస్సు డిపోకు వెళ్తోంది. ఖాళీ బస్సు సిందగి నగరంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మురిగెప్ప గుండెపోటు వచ్చింది. దీంతో వాహనంపై పట్టు కోల్పోవడంతో బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అయితే, డ్రైవర్ పరిస్థితిని గమనించిన కండక్టర్ శరణు బ్రేకులు వేసి బస్సును నిలిపివేశారు. కాగా, కండక్టర్ సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.