అంబులెన్స్ కు దారివ్వలేదని రూ. 11 వేల ఫైన్

10TV Telugu News

Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం బలైంది. ఫలితంగా ఆ వ్యక్తికి రూ. 11 వేల జరిమాన వేశారు పోలీసులు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మైసూరు సమీపంలో చిక్కమగళూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఆచార్య (85) ఆగస్టు 22వ తేదీన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో 108 అంబులెన్స్ వారింటికి వచ్చింది. అనంతరం అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. హన్సూర్ రోడ్డులోని బెళవాడి జంక్షన్ చేరుకున్న అనంతరం రోడ్డుకు అడ్డంగా కారు ఉండడంతో అంబులెన్స్ ను నిలిపివేశాడు డ్రైవర్.
పలుమార్లు హారన్ మ్రోగించి కారును పక్కకు తీయాలని డ్రైవర్ కోరాడు. అయినా ఆ వ్యక్తి కనికరించలేదు. కుటుంబసభ్యులు కిందకు దిగి వచ్చి..పరిస్థితిని తెలియచేశారు. అయినా..మానవత్వం చూపించలేదు. చివరకు స్థానికులు జోక్యం చేసుకోవడంతో కారును పక్కకు తీశాడు. రయ్ మంటూ…ఆసుపత్రికి చేరుకుంది. వైద్యులు పరీక్షించారు. ప్రాణం పోయిందని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తొందరగా వస్తే..ప్రాణాలు కాపాడే వాళ్లమని చెప్పారు.
https://10tv.in/kerala-officials-of-air-intelligence-unit-at-calicut-international-airport-have-seized-700-gms-gold-inside-a-pressure-cooker/
ఈ విషయం మైసూర్ నగర అసిస్టెంట్ కమిషనర్ సందేశ్ కుమార్ కు తెలిసింది. కారు అడ్డుగా నిలిపిన వ్యక్తి జయంత్ గా గుర్తించారు. అంబులెన్స్ దారివ్వకుండా..ఓ వ్యక్తి మరణానికి కారణమైన అతడిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం రూ. 10, 000 జరిమాన, డేంజరస్ డ్రైవింగ్ కు రూ. 1000 ఫైన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు.