Rahul Gandhi: ‘కేజీఎఫ్-2’ పాట వాడుకున్నందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు… ఫిర్యాదు చేసిన ఆడియో సంస్థ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.

Rahul Gandhi: ‘కేజీఎఫ్-2’ పాట వాడుకున్నందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు… ఫిర్యాదు చేసిన ఆడియో సంస్థ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ కేసు నమోదు చేసింది. రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రూపొందించిన ఒక వీడియోకు ‘కేజీఎఫ్-2’ సినిమాలోని పాట వాడుకోవడమే దీనికి కారణం.

Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అనేక వీడియోలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా ఒక వీడియోకు ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాటను వాడింది. రాహుల్ వీడియోకు బ్యాగ్రౌండ్‌లో ‘కేజీఎఫ్-2’ పాటను యాడ్ చేశారు. అయితే, దీనిపై కర్ణాటకకు చెందిన ‘ఎమ్ఆర్‌టీ మ్యూజిక్’ అనే ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఈ పాట వాడుకున్నందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు, రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్, సుప్రియా శ్రీనాతెపై కేసు నమోదు చేసింది.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించి, తమ పాట వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ‘ఎమ్ఆర్‌టీ మ్యూజిక్’ సంస్థ దక్షిణాదికి సంబంధించి ‘కేజీఎఫ్-2’ ఆడియో హక్కుల్ని పొందింది. తాము చాలా డబ్బులు వెచ్చించి, ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నామని, అలాంటిది తమ అనుమతి లేకుండా పాట వాడుకున్నారని ‘ఎమ్ఆర్‌టీ మ్యూజిక్’ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.