Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 16మందిపై కేసు నమోదు..ఏ14గా రామచంద్ర పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఢిల్లీతోపాటు కేసుతో సంబంధం ఉన్న లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 35కుపైగా ప్రదేశాల్లో, ఒకే సమయంలో ఈ దాడులు కొనసాగుతున్న క్రమంలో 16మందిపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ లో దాడులు చేస్తున్న క్రమంలో కోకాపేటలోని రామచంద్రపిళ్లై ఇంట్లో ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ14 నిందితుడిగా రామచంద్ర పిళ్లై పేరును చేర్చారు అధికారులు.

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 16మందిపై కేసు నమోదు..ఏ14గా రామచంద్ర పిళ్లై

Delhi liquor Scam

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన సమీర్ మహేంద్రు నివాసమైన ఢిల్లీతోపాటు కేసుతో సంబంధం ఉన్న లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 35కుపైగా ప్రదేశాల్లో, ఒకే సమయంలో ఈ దాడులు కొనసాగుతున్న క్రమంలో 16మందిపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ లో దాడులు చేస్తున్న క్రమంలో కోకాపేటలోని రామచంద్రపిళ్లై ఇంట్లో ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ14 నిందితుడిగా రామచంద్ర పిళ్లై పేరును చేర్చారు అధికారులు. లిక్కర్ పాలసీ టెండర్లను దక్కించుకోవడటం కోసం రామచంద్ర పిళ్లై లంచాయిలు ఇచ్చినట్లుగా గుర్తించారు అధికారుల.

అరుణ్ పాండ్యా ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు రామచంద్ర పిళ్లై రూ.2.50 కోట్లు లంచం ఇచ్చినట్లుగా అభియోగాలున్నాయి. దీంతో రామచంద్ర పిళ్లై పేరును ఏ14 నిందితుడగా చేర్చారు అధికారులు. సీబీఐ ఇచ్చిన సమాచారంతో పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ రామచంద్ర పిళ్లై ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ.

ఈ దాడుల్లో భాగంగా ఈడీ 35కుపైగా ప్రదేశాల్లో, ఒకే సమయంలో ఈ దాడులు కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో పాత్రధారులుగా ఉన్న అరుణ్ రామ చంద్రపిళ్లైతోపాటు మరో ఐదుగురు నివాసాల్లో కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్‌లకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంఫై కూడా ఈడీ దాడి చేసి సోదాలు చేస్తోంది. అయితే, ఈ కేసులో ముందునుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని మనీష్ సిసోడియా ఇంట్లో మాత్రం ఎలాంటి సోదాలు చేయడ లేదని ఈడీ తెలిపింది. ఈ కేసుతో సంబంధం లేదని మనీష్ సిసోడియా చెబుతున్నారు.

Manish Sisodia: నాపై తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి తేవడం వల్లే సీబీఐ అధికారి ఆత్మహత్య: మనీష్ సిసోడియా