Uttarakhand : భారత హాకీ క్రీడాకారిణి కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తులు

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత హాకీ మహిళల జట్టులో వందనా కటారియా కుటుంబంపై కులం పేరుతో దూషణలకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఉత్తరాఖండ్ లోని రోష్నాబాద్ కు చెందిన వందనా కటారియా కుటుంబంపై కుల పేరుతో దూషించిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో అర్జెంటీనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి తరువాత రోష్నాబాద్ లోని వందనా కటారియా ఇంటి ఎదుట ఇద్దరు వ్యక్తులు కుల దూషణలకు పాల్పడ్డారు.

Uttarakhand : భారత హాకీ క్రీడాకారిణి కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తులు

Vandana Katariya

Cast remarks at Indian hockey player Vandana Kataria : టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత హాకీ మహిళల జట్టులో వందనా కటారియా కుటుంబంపై కులం పేరుతో దూషణలకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఉత్తరాఖండ్ లోని రోష్నాబాద్ కు చెందిన వందనా కటారియా కుటుంబంపై కుల పేరుతో దూషించిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో అర్జెంటీనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి తరువాత రోష్నాబాద్ లోని వందనా కటారియా ఇంటి ఎదుట ఇద్దరు వ్యక్తులు కుల దూషణలకు పాల్పడ్డారు.

వందన కులాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. అనుచిత వ్యాఖ్యలతో ఆమె కుటుంబ సభ్యుల్ని తీవ్ర మనస్తాపానికి గురిచేశారు. అనంతరం బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేశారు సదరు వ్యక్తులు. భారత మహిళల జట్టులో దళితులు ఎక్కువ మంది ఉన్నారని..అందుకే జట్టు ఓడిపోయిందని సదరు వ్యక్తులు అమానుష వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. సదరు వ్యక్తులు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం.

ఒలింపిక్స్ లో అర్జెంటీనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి తరువాత వందనా కటారియా ఇంటి ముందు పటాకులు కాల్చిన శబ్దాలు విని ఆమె కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా ఇద్దరువ్యక్తులు ఆమె కుటుంబాన్ని కుల పేరుతో తీవ్ర పదజాలంతో దూషిస్తూ డ్యాన్సులు వేస్తూ హల్ చల్ చేస్తుంటే వారు సదరు వ్యక్తుల్ని ప్రశ్నించగా వారు మరింతగా రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు.

అలా వందనా కటారియా కుటుంబ సభ్యులకు సదరు వ్యక్తులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వందన సోదరుడు శేఖరర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అజయ్ పాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.దీనిపై వందనా సోదరు కటారియా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ..మా కుటుంబాన్ని కులం పేరుతో దూషించినవారిపై చర్యలుతీసుకోవాలని కోరారు. దళితులను క్రీడలకు దూరంగా ఉంచాలంటూ వ్యాఖ్యానించారని శేఖర్ వాపోయారు.

కాగా.. టోక్యో ఒలింపిక్స్‌ హాకీ కాంస్య పతక పోరులో మహిళా హాకీ జట్టు ఓటమిని చవిచూసింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో పోరాడి ఓడారు. ఫలితంగా హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందని ఎదురుచూసిన అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. నిజానికి రెండో క్వార్టర్‌లో భారత జట్టే ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరల్లో డిఫెన్స్‌పై పట్టుతప్పడంతో బ్రిటన్ వరుస గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన భారతజట్టు త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. కానీ ఆటలో గెలుపులు..ఓటములి సర్వసాధారణం అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. ఆడిన ప్రతీవారు విజయం సాధిస్తే ఇక ఆటేముంటుంది అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది.