India : ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లలకు ఆరేళ్లు నిండాలి : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం

ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లు ఉండాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా..కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.

India : ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లలకు ఆరేళ్లు నిండాలి : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం

Center Govt asks Six years minimum age for Class 1st admission

India Govt schools :  సాధారంగా ఇప్పుడు పిల్లల్ని మూడేళ్లు నిండగానే స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. ప్లేస్కూల్స్ లో మూడేళ్లు దాటకుండానే జాయిన్ చేసేస్తుంటారు. ఆ తరువాత నర్సరీ..ఆ తరువాత ఎల్ కేజీ, యూకేజీ ఆతరువాతనే ఒకటవ తరగతికి వస్తారు పిల్లలు. అలా ఒకటో తరగతిలోకి వచ్చేసరికి ఐదారు ఏళ్లు వస్తాయి పిల్లలకు. కానీ అప్పటికే ఆ చిన్నారులు. పుస్తకాల బరువు మోయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రైవేటుళ్ల స్కూళ్ల పరిస్థితి. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను జాయిన్ చేయాలంటే కచ్చితమైన నిర్ణీత వయస్సు ఉండాల్సిందే. అంతకు తక్కువగా ఉంటే జాయిన్ చేసుకోరు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను జాయిన్ చేయాలంటే వారికి ఆరేళ్లు నిండి ఉండాలని గవర్నమెంట్ నిర్ణయం.

ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లు ఉండాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా..కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం మూడు నుంచి ఎనిమిది ఏళ్ల వయసులో పిల్లలకు ఫౌండేషన్ దశలో భాగంగా మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1, 2 తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి పిల్లలకు ఎటువంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలని ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

ప్రీ స్కూళ్లలో మూడేళ్లపాటు నాణ్యమైన విద్య అందినప్పుడే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది కేంద్ర విద్యాశాఖ. ఈ లక్ష్యం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే స్కూళ్లలో జాయిన్ చేసుకోవాలని స్పష్టంచేసింది. దీని కోసం స్కూల్లో జాయిన్ చేసుకునే ప్రక్రియలో నిబంధనలను సవరించాలని సూచించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా పాఠాలు చెప్పే టీచర్లను తయారుచేయటానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.

దీని కోసం అంగన్‌వాడీలు, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్‌ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం అని వెల్లడించింది. ఈ లక్ష్యం నెరవేరేలా దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని స్పష్టంచేసింది.