కేంద్ర బడ్జెట్ 2021-22, భారీ మొత్తంలో కేటాయింపులు

కేంద్ర బడ్జెట్ 2021-22, భారీ మొత్తంలో కేటాయింపులు

Central Budget 2021-22, Huge Allocation : బడ్జెట్‌లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపులు జరిపారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 సంవత్సరానికి పార్లమెంట్ లో సోమవారం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. వైద్య ఆరోగ్యం కోసం రూ.2.23 లక్షల కోట్లు కేటాయించారు. వాయు కాలుష్యం నివారణ కోసం 42సెంటర్లకు రూ.2,217 కోట్లు కేటాయించారు.

మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడేళ్లలో 7పార్కుల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెట్రో రైల్ నెట్‌వర్క్ మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. మెట్రో రైల్‌ అభివృద్ధి కోసం పీపీపీ విధానాన్ని అవలంభిస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కి.మీ. రోడ్లు నిర్మించామని తెలిపారు. కొచ్చి మెట్రో రైల్ ఫేజ్-2కు 1,957 కోట్లు, చెన్నై మెట్రో రైల్ ఫేజ్‌కు .5,300 కోట్లు, బెంగళూరు మెట్రో రైల్ ఫేజ్-2కు .14,788 కోట్లు, నాగ్‌పూర్ మెట్రో రైల్ ఫేజ్-2కు .5,976 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

ప్రజా రవాణా కోసం కొత్తగా రూ.18 వేల కోట్లతో బస్సులు కొనుగోలు చేస్తున్నామని నిర్మల ప్రకటించారు. 9 షిప్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ల ద్వారా లాభాలు వస్తున్నాయని, భారీగా విదేశీ మారకం దేశంలో ప్రవేశిస్తోందని తెలిపారు.