Indian Government: చైనాకు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ నోటీసులు

కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.

Indian Government: చైనాకు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ నోటీసులు

Vivo

Indian Government: కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది. చైనా సరిహద్దుల్లో చేస్తున్న కవ్వింపు చర్యలను తిప్పికొడుతూనే.. మార్కెట్ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన పలు యాప్‌లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా అప్పట్లో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చీనీయాంశం అయ్యింది.

లేటెస్ట్‌గా భారత మార్కెట్‌లో 50శాతానికి పైగా ఫోన్లతో ఆధిపత్యం చలాయిస్తున్న చైనా బ్రాండ్‌ ఫోన్ల కంపెనీలు వివో, ఒప్పో, షియోమీ, వన్‌ఫ్లస్‌‌లకు నోటీసులు పంపించింది. ఇకనుంచి భారత్‌లో అమ్మబోయే ప్రతీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ముందుగానే భారత్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది. సదరు బ్రాండ్‌ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో చెప్పాల్సిందేనని నోటీసుల్లో స్పష్టం చేసింది.

చైనాకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ల వల్ల సెక్యురిటీ ఇబ్బందులు వస్తున్నాయని, భావించిన కేంద్రం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు.. ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్స్‌ సహా.. భారత్‌లోని కన్జూమర్ ప్రొడక్టుల వివరాలను ముందే చెప్పాలని, అసలు అవి సెక్యూర్‌గా ఉన్నాయా? లేదా? అనేది? ముందుగానే తేల్చుకోవాలని సూచించింది.

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య గతేడాది భారత ప్రభుత్వం.. టిక్‌టాక్‌తో సహా 220కి పైగా చైనా యాప్‌లను నిషేధించింది. ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణ చేసే అవకాశం ఉందని, స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో బలంగా ఉండే ఈ బ్రాండ్ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది కేంద్రం.