Chandrayaan 3: గుండె ఆగిపోయినంత పనైంది.. గోతిలో పడబోయిన రోవర్.. ఇస్రోతో ఆటలా చందమామ?

రోవర్ 2023, ఆగస్టు 27న ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ (బిలం లేదా గొయ్యి) కనపడింది.

Chandrayaan 3: గుండె ఆగిపోయినంత పనైంది.. గోతిలో పడబోయిన రోవర్.. ఇస్రోతో ఆటలా చందమామ?

Chandrayaan-3

Chandrayaan 3 – Rover : జాబిల్లిపై తిరుగుతూ అధ్యయనం చేస్తున్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Rover) గోతిలో పడబోయింది. దీంతో ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు రోవర్ దిశను మార్చారు.

‘ రోవర్ 2023, ఆగస్టు 27న ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ (బిలం లేదా గొయ్యి) కనపడింది. ఈ గొయ్యి నాలుగు మీటర్ల వెడల్పు ఉంది. దీంతో రోవర్ దిశ మార్చుకునేలా చేశాము. ఆ తర్వాత రోవర్ ఆ పని చేసి మరో దిశగా సురక్షితంగా వెళుతోంది ’ అని ఇస్రో పేర్కొంది.

కాగా, ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై స్థిరంగా ఉంటుంది. రోవర్ ఆ ప్రాంతంలో తిరిగి అక్కడి సమాచారాన్ని ల్యాండర్ కు పంపుతుంది. ఆ ల్యాండర్ నుంచి ఇస్రోకు సమాచారం అందుతుంది. చంద్రుడి పరిసరాల్లో తిరగడానికి తగ్గట్లు రోవర్ ను రూపొందించారు. రోవర్ కు ఆరు చక్రాలు ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.

ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే(14 Earth days). విక్రమ్ ల్యాండర్‌ (3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) జాబిల్లి గుట్టును విప్పుతాయి. ఒక్కో క్షణానికి ఒక సెంటీ మీటరు వేగం చొప్పున రోవర్ ముందుకు వెళుతోంది. అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తోంది.

Aditya-L1: ఆదిత్య ఎల్‌-1కి ముహూర్తం ఖరారు.. జాబిల్లి దక్షిణ ధ్రువం దాసోహమైంది.. ఇప్పుడు సూర్యగోళం.. 177 రోజుల్లోగా..