Aditya-L1: ఆదిత్య ఎల్‌-1కి ముహూర్తం ఖరారు.. జాబిల్లి దక్షిణ ధ్రువం దాసోహమైంది.. ఇప్పుడు సూర్యగోళం.. 177 రోజుల్లోగా..

సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్పియర్‌ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి

Aditya-L1: ఆదిత్య ఎల్‌-1కి ముహూర్తం ఖరారు.. జాబిల్లి దక్షిణ ధ్రువం దాసోహమైంది.. ఇప్పుడు సూర్యగోళం.. 177 రోజుల్లోగా..

Aditya L1 Mission

Aditya-L1- ISRO: సూర్యుడి గుట్టు విప్పే ఉద్దేశంతో ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ముహూర్తం పెట్టారు. ముందుగా అనుకున్నట్లుగానే సెప్టెంబరు 2న ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి దాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటన చేసింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేయనున్నారు. ఈ సోలార్‌ మిషన్‌ ద్వారా సౌర కరోనా, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై పరిశోధనలు చేస్తారు. అలాగే, సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం చేయనున్నట్లు ఇప్పటికే ఇస్రో తెలిపింది.

ఇలా వస్తున్నాం ‘సూర్య’..

బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ కు తీసుకొచ్చారు

అంతరిక్ష మిషన్లకు సంబంధించిన వ్యోమనౌకలను యూఆర్ఎస్సీలోనే అభివృద్ధి చేస్తారు. ఇందులోనే చంద్రయాన్-3ను కూడా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంతో సూర్యుడిపై రహస్యాలను రాబట్టనున్నారు

సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్పియర్‌ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి

ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహం బరువు 1,475 కిలోలు. అందులో పేలోడ్ల బరువు 244 కిలోలు ఉంటుంది. మొత్తం 6 పేలోడ్లు ఉంటాయి

మొదట ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి ప్రవేశపెడతారు

లాగ్రేంజియన్‌ పాయింట్‌-1(ఎల్‌-1) భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులోకి ఆదిత్య-ఎల్ 1 చేరుకోవడానికి 109-177 రోజుల సమయం తీసుకుంటుంది

ఎల్‌-1 నుంచి అధ్యయనం చేస్తే ఆటంకాలు ఏవీ ఉండవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు

కొన్ని వేల కిలోమీటర్ల వరకు భానుడి కరోనా ఉంటుంది

దాని ఉష్ణోగ్రత స్థాయి సుమారు 10 లక్షల డిగ్రీల కెల్విన్‌ డిగ్రీలు

అంతేగాక, భానుడి లోపలి ఉష్ణోగ్రత దాదాపు 6 వేల కెల్విన్‌ డిగ్రీలు

Chandrayaan 3: ఇంత గొప్పవారు బొట్టుబిళ్ల, కుంకుమ, మంగళ సూత్రంతో..: హీరోయిన్ కంగన