Chandrayaan 3: అగ్రదేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో తెలుసా? ఒక్కసారి ల్యాండ్ అయ్యామో..

అసలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగాలని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా?

Chandrayaan 3: అగ్రదేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో తెలుసా? ఒక్కసారి ల్యాండ్ అయ్యామో..

Chandrayaan 3

Chandrayaan 3 – Moon south pole: చంద్రయాన్-3 ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పగలు (Lunar day) ప్రారంభమవుతుంది. లానార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరగనున్నాయి.

ప్రయోగం సఫలం అయితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలాగే, ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలుస్తుంది.

దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించి ఇప్పటికే భారత చంద్రయాన్-2 మిషన్ విఫలమైంది. ఇటీవలే రష్యా లూనా-25 దక్షిణ ధ్రువంపై దిగడానికి ప్రయత్నించి కుప్పకూలింది. అసలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగాలని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇస్రో ల్యాండింగ్ కోసం దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకుంది? భవిష్యత్తు అవసరాలు, పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని భారత్ దక్షిణ ధ్రువంపై రోవర్, ల్యాండర్లను దింపాలని ప్రణాళికలు వేసుకుంది.

దక్షిణ ధ్రువంలో ఇప్పటివరకు ఏ దేశ రాకెట్ కూడా ల్యాండ్ కాలేదు. అక్కడ ల్యాండింగ్ తగ్గ సరైన ప్రదేశం కోసం ఇస్రో దృష్టి పెట్టింది. ఇస్రో ప్రతి మిషన్ విషయంలోనూ ప్రత్యేక అంశాలపై దృష్టి పెడుతుందని ఓ శాస్త్రవేత్త చెప్పారు. అలాగే, రెండో అంశం ఏంటంటే, అధిక మొత్తంలో నీటిని గుర్తించాలని ఇస్రో భావిస్తోంది. దక్షిణ ధ్రువంలో చాలా పెద్ద క్రేటర్స్ ఉండడంతో ఇది సాధ్యమవుతుంది.

 హ్యూమన్ కాలనీ నిర్మాణం

దక్షిణ ధ్రువంపై శిఖరాల్లాంటి భాగాలు ఉంటాయి. అక్కడి స్థలాలు ప్రత్యేక ఆకృతిలో ఉంటాయి. శిఖరాల్లాంటి భాగాల్లో శాశ్వతంగా సూర్యరశ్మి పడుతుంది. శాస్త్రవేత్తలు వెళ్లి దక్షిణ ధ్రువంలో ఉండడానికి, పరిశోధనలు చేసుకోవడానికి దక్షిణ ధ్రువ ప్రాంతం ఉపయోగపడవచ్చు. 2030లోపు ఇటువంటి హ్యూమన్ కాలనీని నిర్మించాలని చైనా ఇప్పటికే యోచిస్తోంది.

జాబిల్లిపై ఉత్తర ధ్రువంతో పోల్చి చూస్తే, దక్షిణ ధ్రువమే అధిక కాలం చీకటిలో (నీడలో) ఉంటుంది. దీంతో ఉత్తర ధ్రువంపై దాదాపు 10 కోట్ల టన్నుల నీళ్లు ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడి పలు ప్రదేశాల్లో కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి వెలుగు పడడం లేదు. ఈ నేపథ్యంలో సౌర వ్యవస్థ పుట్టుక గుట్టు విప్పే ఆధారాలు కూడా అక్కడ ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అలాగే, ఇక్కడ అమ్మోనియా, హైడ్రోజన్‌, మిథేన్‌ మూలకాలు ఉంటాయని అంచనా వేశారు. కాలుష్యం లేకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేసే హీలియం-3 కూడా ఇక్కడ ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడ మంచు రూపంలో ఉన్న నీళ్లు శాస్త్రవేత్తలు భవిష్యత్తులోని మిషన్లకు ఇంధనంతో పాటు ఆక్సిజన్, తాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇవి అన్నీ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చేపట్టబోయే ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

Chandrayaan 3: చంద్రుడిపై దిగిన తర్వాత రోవర్, ల్యాండర్ ఏం చేస్తాయో తెలుసా? ఆశ్చర్యపోతారు..