Chardham Yatra: మే 6న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: చార్ ధామ్ యాత్ర వివరాలు

2022 ఏడాదికి గానూ పవిత్ర కేదార్ నాథ్ ఆలయాన్ని మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Chardham Yatra: మే 6న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: చార్ ధామ్ యాత్ర వివరాలు

Chardham

Chardham Yatra: భారతీయుల అత్యంత పవిత్రమైన చార్ ధామ్ హిమాలయ యాత్రా వివరాలను ఉత్తరాఖండ్ దేవాదాయశాఖ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా 2022 ఏడాదికి గానూ పవిత్ర కేదార్ నాథ్ ఆలయాన్ని మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్నీ మే 8న మిగిలిన రెండు చార్ధామ్ ఆలయ పుణ్యక్షేత్రాలు, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్యాత్రను మే 3న అక్షయ్ తృతీయ రోజున తెరవనున్నారు. మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో శాస్త్రోక్తకంగా చేపట్టిన పూజా కార్యక్రమాలను పరమశివుడికి అంకితం చేసిన అర్చకులు.. కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు శుభఘడియలను లెక్కించి ప్రకటించారు.

Also read: MP : ఉజ్జయినిలో 11.71 లక్షల దీపాలు.. గిన్నిస్ రికార్డు

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ హిమాలయాల్లోని మందాకిని నది ఒడ్డున ఉన్న “చార్ ధామ్” పవిత్రాలయాలలో కేదార్ నాథ్ ఒకటి. పురాణాల ప్రకారం, ఈ ఆలయం పాండవులచే స్థాపించబడింది. శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ప్రధానమైనది ఈ కేదార్ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 14 – 16 కిలోమీటర్ల మేర హిమాలయ పర్వతాల్లో కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఏటా చలికాలంలో ఈ ఆలయాన్ని మూసి తిరిగి వేసవి ప్రారంభం అయ్యాక తెరుస్తారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు కేదార్‌నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది.

Also read: Maha Shivaratri : లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా మహా శివరాత్రి పూజలు

భక్తులకు సూచనా:
1. ఆన్ లైన్/ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్
చార్ ధామ్ యాత్రకు హాజరయ్యే యాత్రికులకు ఇప్పుడు ఫోటోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అవసరం. ఫోటోమెట్రిక్ రిజిస్ట్రేషన్లు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండింటిలోనూ చేయబడతాయి. చార్ ధామ్ యాత్రలో అనుకోని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో యాత్రికులను గుర్తించడానికి ఈ ఫోటోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది.
2. కోవిడ్ పరిమితులు
కోవిడ్ కారణంగా, గత సంవత్సరం చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు పరిమితులు విధించారు. అయితే, ఈ ఏడాదిలో భక్తుల రాకపై ఎటువంటి పరిమితులు ఉండవని అధికారులు వెల్లడించారు.
3. మెడికల్ సర్టిఫికేట్
చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గుప్త్ కాశీ మరియు సోన్ ప్రయాగ్ లోని వైద్య కేంద్రాల వద్ద హెల్త్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. భక్తుల రక్తపోటును, ఇతర రుగ్మతలను పరీక్షించి.. ఆరోగ్యం సహకరిస్తేనే వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఆలయాలను చేరుకొనే భక్తులలో కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ వైద్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు.

Also read:Maha Shivaratri 2022 : తిరుపతి కపిలతీర్థంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు