Cheetahs Again In India : 70 సంవత్సరాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు.. మరో ఖండం నుంచి తీసుకురావడం ఇదే తొలిసారి

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు పరుగులు తీస్తున్నాయి. జెట్‌ స్పీడ్‌తో అత్యంత వేగంగా దూసుకెళ్లే పేరున్న ఆఫ్రికన్‌ చీతాలు... మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో తొలిరోజు ఉరుకులు పరుగులు పెట్టాయి. ప్రయాణంతో చీతాలు కొంత అలసినట్లు కనిపించినప్పటికీ కొంత హుషారుగానే కనిపించాయి.

Cheetahs Again In India : 70 సంవత్సరాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు.. మరో ఖండం నుంచి తీసుకురావడం ఇదే తొలిసారి

Cheetahs again in India

Cheetahs Again In India : మనం వేరే ఊరు వెళ్తేనే అక్కడి వాతావరణం, నీళ్లు పడక.. దగ్గు, జలుబు వస్తుంది. అలాంటి 8వేల 4వందలకు పైగా కిలోమీటర్ల సుదూరం నుంచి వచ్చిన చీతాలు ఎలా జీవిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సముద్రాలు దాటి వేల కిలోమీటర్ల సుదూర ప్రాంతం నుంచి, ఇంకా చెప్పాలంటే డెడ్‌ఆపోజిట్‌గా ఉండే వేరే ఖండం నుంచి రావడంతో చీతాలు మన దగ్గర సంతోషంగా బతుకుతాయా అని మొదట ప్రతిఒక్కరూ సంశయించారు. అయితే అవేమీ చీతాలపై ప్రభావం చూపలేదు. తొలిరోజూ చీతాలు ఎంతో హుషారుగా కనిపించాయి.

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు పరుగులు తీస్తున్నాయి. జెట్‌ స్పీడ్‌తో అత్యంత వేగంగా దూసుకెళ్లే పేరున్న ఆఫ్రికన్‌ చీతాలు… మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో తొలిరోజు ఉరుకులు పరుగులు పెట్టాయి. ప్రయాణంతో కొంత అలసినట్లు కనిపించినప్పటికీ కొంత హుషారుగానే కనిపించాయి చీతాలు. నమీబియా నుంచి నిన్న చీతాలు రావడం… అక్కడితో పోలిస్తే ఇక్కడ ఒక్కసారిగా వాతావరణం మారడంతో… ఇక్కడి పరిస్థితులను అలవాటు పడేందుకు చీతాలకు కొంత సమయం పట్టే అవకాశముంది. వేరొక ఖండం నుంచి చీతాలు రావడంతో వాటికి ఉన్న రోగ నిరోధక శక్తి ఎలా ఉండొచ్చన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Cheetahs In India: చీతాలు పెంపుడు జంతువులే! ఇండ్లల్లోనే పెంచుకున్న భారతీయులు… అప్పటి వీడియోలు విడుదల

చీతాలు విజయవంతంగా సంతానోత్పత్తి చేయగలవు. అప్పుడే పుట్టిన చీత పిల్లలను కనీసం ఏడాది పాటు జీవించి ఉండేలా ప్రత్యేక శద్ధ తీసుకోవాలి. మొదటి తరంలో చీతాలు విజయవంతంగా సంతానోత్పత్తి చేస్తాయి. అయితే ఆ చీతాలు ఐదేళ్ళ మనుగడ సాగించకపోయినా… పునరుత్పత్తి చేయడంలో విఫలమైన ప్రాజెక్ట్‌ విఫలమవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కోసం ప్రభుత్వం పలు వ్యూహాలు సిద్ధం చేసింది. చీతాలకు కావాల్సిన పోషకాలు, ఫుడ్‌ను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏదేమైనా మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌ మేనేజ్‌మెంట్‌కు ఇది పెద్ద సవాల్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులుగా పేరున్న చీతాలు.. భారత్‌లో అంతరించిపోయి దాదాపు 70ఏళ్లు అవుతోంది. ఒక పెద్ద మాంసాహార జంతువును మరో ఖండం నుంచి భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటిస్తూ చీతాలను సంరక్షిస్తామని చెప్పారు మోదీ. ఇక ఐదేళ్లలో మొత్తం 50 చీతాలను వివిధ దశల్లో ఆఫ్రికా నుంచి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.