Pani Puri : ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి.. గప్ చుప్ తిని 77మంది ఆసుపత్రి పాలు

చిరు తిండి పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. కామన్ మ్యాన్ అయినా రిచ్ మ్యాన్ అయినా.. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. దాదాపుగా అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి(గప్ చుప్). రోడ్

Pani Puri : ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి.. గప్ చుప్ తిని 77మంది ఆసుపత్రి పాలు

Pani Puri

Pani Puri : పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. కామన్ మ్యాన్ అయినా రిచ్ మ్యాన్ అయినా.. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. దాదాపుగా అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి(గప్ చుప్). రోడ్డుపక్కన పానీపూరి బండి కనిపిస్తే చాలు.. ఓ పట్టు పట్టకుండా వదలరు. పానీపూరి టేస్ట్ చేయనిదే ముందుకు కదలరు. అంతగా ఇష్టపడతారు పానీపూరి అంటే. అయితే, ఇది తినడం వల్ల కొంతమంది ఆసుపత్రిపాలయ్యారు. పానీపూరి తిన్న 77మంది అనారోగ్యం బారినపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని గటపార్‌ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

గటపార్‌ కాలా గ్రామంలో వారాంతపు మార్కెట్ నిర్వహిస్తారు. మార్కెట్ కు వచ్చిన వారు పానీపూరి తిన్నారు. అంతే, వారంతా ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. ముందు కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. ఆ తర్వాత వాంతులు చేసుకున్నారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?

ఫుడ్‌ పాయిజన్ వల్లే వీరంతా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు వివరించారు. మొత్తం 77మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 57మంది పిల్లలు ఉన్నారు. 26 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. వారంతా పానీపూరి తినడంతో పాటు ఇతర ఫుడ్ ఐటెమ్స్ కూడా తిన్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని అధికారులు చెప్పినా.. దీనిపై విచారణకు ఆదేశించారు. అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.