మోడీ స్ఫూర్తితో : ఆమె కుడుతుంది..ఆయన పంచుతాడు  

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 06:32 AM IST
మోడీ స్ఫూర్తితో : ఆమె కుడుతుంది..ఆయన పంచుతాడు  

ప్రధాని నరేంద్రమోడీ మాటే వేదవాక్కుగా భావించి తమ వంతుగా ప్లాస్టిక్ నియంత్రణకు పాటు పడుతున్నారు దంపతులు. రోజు రోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ఆగస్టు 15న ప్రధాన మోడీ ఎర్ర కోటపై చేసిన ప్రసంగంలో ప్లాస్టిక్ వినియోగించవద్దని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మాట ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లోని ఆశ, సురేంద్ర అనే దంపతులు స్ఫూర్తిగా తీసుకున్నారు.

వస్త్రాల సంచులు కుడుతూ అందరికి ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇంట్లో పాత బట్టల్ని సేకరించి వాటితో చక్కటి డిజైన్లతో ఆశ బ్యాగులు కుడుతుంది. వాటిని ఆమె భర్త సురేంద్ర అందరికి పంచుతారు..అలా పంచేటప్పుడు దయచేసి ప్లాస్టిక్ వాడటం మానేయండి.. అంటు దాని వల్ల జరిగే అనర్థాలను గురించి వివరించి చెప్తుంటారు.  

ప్లాస్టిక్ మనుషులకే కాదు జంతువులతో పాటు సమస్త జీవరాశులకు చేటు చేస్తుంది అని చెబుతూ..ఆశ, సురేంద్ర దంపతులు బ్యాగులను పంచిపెడుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ భారీ సంఖ్యలో బ్యాగులను పంచినవీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధానికి వీరు చేసే పని చిన్నదైనా స్ఫూర్తినిచ్చేదిగా ఉంది.