గల్వాన్ ఘర్షణపై వీడియో విడుదల చేసిన డ్రాగన్ చైనా..

గల్వాన్ ఘర్షణపై వీడియో విడుదల చేసిన డ్రాగన్ చైనా..

Chinese Galwan Clash : 2020లో భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారితీసిన గల్వాన్ ఘటనకు సంబంధించి డ్రాగన్ చైనా ఒక వీడియోను విడుదల చేసింది. భారత్ పై నెగటివ్ ప్రచారాన్ని చైనా ఉధృతం చేసింది. భారత్ పై చైనా మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. తప్పంతా భారత్ దే అన్నట్టు నిరూపించేందుకు చైనా పాట్లు పడుతోంది. ఎడిట్ చేసిన వీడియోను డ్రాగన్ విడుదల చేసింది. భారత సైనికులే సరిహద్దును మార్చడానికి ప్రయత్నించారంటూ అసత్య ఆరోపణలు చేస్తోంది.

తమ సైనికులు దాడి చేస్తున్న దృశ్యాలను డ్రాగన్ చూపించలేదు. భారత సైనికులే తమమై ముందు దాడికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తోంది. సైనికుల ఘర్షణలో నలుగురు సైనికులే చనిపోయారంటూ చైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 40మందికి పైగా చైనా సైనికులు చనిపోయినట్టు అమెరికా, రష్యా నిఘా సంస్థల కథనాలు వెలువడ్డాయి.


ఈ మేరకు మృతుల పేర్లను కూడా చైనా విడుదల చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావోతో పాటు, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందినట్లు పేర్కొంది. అమరులైన సైనికులకు గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది. తూర్పు లడఖ్ ఘర్షణలో ఐదుగురు మిలటరీ ఆఫీసుర్లు, సంబంధించిన ఇరు దేశాల సైనికులు వీడియో సాక్ష్యాల‌ను త‌మ ద‌గ్గ‌ర పెట్టుకున్నారు.

భార‌త సైన్యంతో చైనా సైనికులు వాగ్వివాదానికి దిగినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉండొద్దంటూ చైనా సైనికులు హడావుడి చేశారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. చైనా సైనికుల మాట‌ల‌కు మాట‌ల‌తోనే దీటుగా స‌మాధానం ఇచ్చారు.